తొలి క్యాథ్‌ల్యాబ్‌ ఖమ్మంలో..  | Sakshi
Sakshi News home page

తొలి క్యాథ్‌ల్యాబ్‌ ఖమ్మంలో.. 

Published Fri, Jan 28 2022 5:01 AM

Khammam: Harish Rao To Inaugurate Cath Lab At District Hospital - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గుండె జబ్బులకు చికిత్స అందించే అత్యాధునిక క్యాథ్‌ల్యాబ్‌ సౌకర్యం మొదటిసారిగా జిల్లాల్లో ఏర్పాటు కానుంది. శుక్రవారం ఖమ్మంలో క్యాథ్‌ల్యాబ్‌ను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభిస్తారు. హైదరాబాద్‌ మినహా జిల్లాల్లో నెలకొల్పనున్న తొలి క్యాథ్‌ల్యాబ్‌ ఇదే. త్వరలో సిద్దిపేట, మహబూబ్‌నగర్‌ బోధనాసుపత్రులకు రానుంది. ప్రస్తుతం ఉస్మానియా, నిమ్స్, గాంధీల్లోనే ఈ సేవలు కొనసాగుతున్నాయి.

వచ్చే ఏడాది సిద్దిపేటలో, 2024లో మహబూబ్‌నగర్‌ బోధనాసుపత్రుల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కోదానికి రూ.7 కోట్లు ఖర్చు కానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను తాజాగా వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి నివేదించింది. క్యాథ్‌ల్యాబ్‌ల్లో గుండె జబ్బుల పరీక్షలు, చికిత్సకు సంబంధించిన అత్యాధునిక సౌకర్యాలుంటాయి.

Advertisement
 
Advertisement