దళిత బంధు: ‘ఆలస్యమవుతుంది, రాదు అనే అనుమానాలొద్దు’

Karimnagar: CS Somesh Kumar Meeting With Rahul Bojja On dalit bandu - Sakshi

సాక్షి, కరీంనగర్‌:  జిల్లా కలెక్టరేట్‌లో దళిత బంధుపై తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జాతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మమాట్లాడుతూ.. దళిత బంధు అద్భుతమైన పథకమని కొనియాడారు. పథకం కింద 10 లక్షల రూపాయలు లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుందనన్నారు. స్వేచ్ఛగా ఏ ఉపాధి పొందుతారో ఆ రంగంలో డబ్బులు ఇస్తారని తెలిపారు. దళిత బంధు రాష్ట్రం మొత్తం అమలు జరుగుతుందని, అనుమానాలు ఏమీ అవసరం లేదని స్పష్టం చేశారు. ఈనెల 16న సీఎం సభలో 15 మంది లబ్ధిదారులకు చెక్కులు అందిస్తారని పేర్కొన్నారు. ఇంకా ఎవరిని కూడా లబ్ధిదారులను ఎంపిక చేయలేదని అన్నారు. అందరికీ అమలు అవుతుందని, తమకు ఆలస్యమవుతుందని, మాకు రాదు అనే అనుమానాలు అవసరం లేదన్నారు.

దళిత బంధు హుజూరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకుంటున్నామమని రాహుల్‌ బొజ్జా అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా వచ్చిన దళితుల జాబితా తమ వద్ద ఉందని, వివరాలు లేని వారిని కూడా నమోదు చేస్తారని వెల్లడించారు. ప్రతీ గ్రామం నుంచి నలుగురు కో ఆర్డినేటర్‌లు ఉంటారని, గ్రామ సభ ద్వారా అందరి ముందు లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుందన్నారు. ప్రతీ కుటుంబంతో మాట్లాడి ఏ స్కీం తీసుకుంటారో చర్చించి అవగాహన కల్పించి పథకాన్ని గ్రౌండ్ చేస్తారని తెలిపారు ఏడాది నుంచి రెండేళ్ల వరకూ కూడా స్కీం తీరును అధికారులు మానిటర్ చేస్తారని పేర్కొన్నారు. దళిత రక్షక నిధి కూడా ఉంటుందని అన్నారు.

సాక్షి, కరీంనగర్‌: ఇళ్ళందకుంట మండలం కనగర్తి గ్రామంలో దళిత బంధు అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దళితులు పురుగుల మందు డబ్బాలతో ధర్నా నిర్వహించారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్దం చేశారు. అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top