బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లోనే ఎక్కువ!

Hyderabad Traffic Cops on Overdrive, Nab Hordes of Traffic Violators - Sakshi

ట్రాఫిక్‌ పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌ ముమ్మరం

వారం రోజుల వ్యవధిలోనే... 

నిబంధనలు పాటించనివారు 7617 మంది

సైలెన్సర్లు మార్చి శబ్ధ కాలుష్యం

భారీగా పట్టుబడుతున్న వాహనదారులు

మద్యం మత్తులో మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం... హెల్మెట్‌ లేకుండా ద్విచక్ర వాహనాల డ్రైవింగ్‌... రాంగ్‌రూట్‌లో వెళ్తూ ప్రమాదాలకు గురికావటం... సిగ్నల్‌ జంపింగ్‌... సీటు బెల్టు ధరించకపోవడం... వెనుక కూర్చున్న వారు హెల్మెట్‌ ధరించకపోవడం ఇలాంటివన్నీ ట్రాఫిక్‌ నిబంధనలకు వ్యతిరేకం. ప్రాణాంతం కూడా. పోలీసులు ఎంత చెప్పినా.. అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ఉల్లంఘనులు కొనసాగుతూనే ఉన్నాయి.
 
సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు వారం రోజుల పాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి భారీగా ‘ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన’ల కేసులు నమోదు చేశారు. ఈ నెల 4 నుంచి 11వ తేదీ వరకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు రాత్రి 9 నుంచి 11 గంటల వరకు 3 గంటల పాటు ఈ డ్రైవ్‌ చేపట్టారు. ఇందులో అధికంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపైనే దృష్టిసారించారు. మద్యం సేవించి వాహనాలపై వెళ్లే ప్రాంతాలను గుర్తించి అక్కడే రోజూ ఈ తనిఖీలు నిర్వహించారు. (చదవండి: హైదరాబాద్‌ పోలీస్‌.. టార్గెట్‌ న్యూ ఇయర్‌ పార్టీస్‌!)

బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ పీఎస్‌ పరిధిలో..
బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వారం రోజుల పాటు నిర్వహించిన స్పెషల్‌ డ్రైవ్‌లో మొత్తం 7024 ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఇందులో సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్న 14 మందితో పాటు హెల్మెట్‌ లేకుండా వాహనాలు నడుపుతున్న 1794 మందిపై కేసులు నమోదు చేశారు. (చదవండి: రోడ్డు ప్రమాదం.. నిందితుడిని అరెస్టు చేయరా?)

► సక్రమంగా నంబర్‌ ప్లేట్‌ లేని 81 మంది, ట్రిబుల్‌ రైడింగ్‌ చేస్తున్న 50 మందిపై కేసులు నమోదు చేశారు.

► నంబర్‌ ప్లేట్‌ లేకుండా వాహనాలు నడుపుతున్న 33 మందిపై కేసు నమోదు చేశారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో 54 కేసులు నమోదయ్యాయి.

► రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌ చేస్తూ 105 మంది పట్టుబడ్డారు.

► ఇతరత్రా నిబంధనలు ఉల్లంఘించిన ఇంకో 1640 మందిపై కేసులు నమోదయ్యాయి.  

జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పీఎస్‌ పరిధిలో..
జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 589 కేసులు నమోదయ్యాయి.  
► డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు 70 నమోదు కాగా మైనర్లు వాహనాలు నడుపుతూ ఒకరు పట్టుబడ్డారు.

► నంబర్‌ ప్లేట్‌సరిగా లేని 35 మందిపై హెల్మెట్‌ ధరించకుండా వాహనాలు నడుపుతున్న 71 మందిపై కేసులు నమోదు చేశారు.

► సంబంధం లేని ఇతరులకు వాహనాలు ఇచ్చి నడిపిస్తుండగా అలా 57 మందిపై కేసులు నమోదు చేశారు.

► సైలెన్సర్లు మార్చి అధిక శబ్ధంతో వాహనాలు నడుపుతున్న ఏడు మందిపై కేసులు నమోదు చేశారు. ప్రమాదకరంగా వాహనాలు నడుపుతున్న ఒకరిపై కేసు నమోదైంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top