HYD: ఎట్టకేలకు చిక్కిన చిరుత | Hyderabad Manchirevula Leopard Captured After 12 Days | Sakshi
Sakshi News home page

HYD: ఎట్టకేలకు చిక్కిన చిరుత

Jul 31 2025 9:50 AM | Updated on Jul 31 2025 10:11 AM

Hyderabad Manchirevula Leopard Captured After 12 Days

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: గత 12 రోజులుగా అధికారులకు కంటి మీద కునుకులేకుండా చేసిన చిరుతపులి ఎట్టకేలకు చిక్కింది. మంచిరేవులలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత పడిందని అధికారులు ప్రకటించారు. దీనిని నల్లమల్ల అడవిలో వదిలిపెట్టనున్నట్లు తెలిపారు.   

నగర శివారులో గత రెండు వారాలుగా చిరుత సంచారం జనాలను భయాందోళనకు గురి చేస్తూ వచ్చింది.  మృగవని పార్క్‌ గ్రేహౌండ్స్‌ పరిధిలో చిరుత సంచారం కలకలం రేపింది. దీనిని బంధించేందుకు 8 ట్రాప్‌ కెమెరాలు, 4 బోనులు ఏర్పాటు చేశారు అధికారుల. అయినా అది చిక్కకుండా అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది. ఈ క్రమంలో గత అర్ధరాత్రి దాటాక మొయినాబాద్‌ ఎకోటిక్‌ పార్క్‌లో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement