breaking news
mrugavani park
-
HYD: ఎట్టకేలకు చిక్కిన చిరుత
సాక్షి, హైదరాబాద్: గత 12 రోజులుగా అధికారులకు కంటి మీద కునుకులేకుండా చేసిన చిరుతపులి ఎట్టకేలకు చిక్కింది. మంచిరేవులలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత పడిందని అధికారులు ప్రకటించారు. దీనిని నల్లమల్ల అడవిలో వదిలిపెట్టనున్నట్లు తెలిపారు. నగర శివారులో గత రెండు వారాలుగా చిరుత సంచారం జనాలను భయాందోళనకు గురి చేస్తూ వచ్చింది. మృగవని పార్క్ గ్రేహౌండ్స్ పరిధిలో చిరుత సంచారం కలకలం రేపింది. దీనిని బంధించేందుకు 8 ట్రాప్ కెమెరాలు, 4 బోనులు ఏర్పాటు చేశారు అధికారుల. అయినా అది చిక్కకుండా అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది. ఈ క్రమంలో గత అర్ధరాత్రి దాటాక మొయినాబాద్ ఎకోటిక్ పార్క్లో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. -
అటవీ భూములను పరిరక్షించాలి
మొయినాబాద్ (రంగారెడ్డి జిల్లా) : అటవీ భూములు కబ్జాకు గురికాకుండా పరిరక్షించాలని రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్-2 ఆమ్రపాలి అన్నారు. శుక్రవారం మొయినాబాద్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. మృగవని జాతీయపార్కు భూములకు సంబంధించిన రికార్డులను జేసీ పరిశీలించారు. అటవీశాఖ ఆధీనంలో ఉన్న మృగవని జాతీయ పార్కు భూములు కబ్జాకు గురవుతున్నాయని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు అందడంతో ఆ భూముల వివరాలను తెలుసుకునేందుకు ఆమె శుక్రవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి రికార్డులను పరిశీలించారు. మండలంలోని చిలుకూరు రెవెన్యూలోని సర్వేనంబర్ 1లో 1,417 ఎకరాల 15 గుంటల భూమి అటవీశాఖ ఆధీనంలో ఉంది. దీనికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ భూమికి సంబంధించి శనివారం నుంచి పూర్తిగా సర్వేచేయాలని అధికారులను జేసీ ఆదేశించారు. ఆమె వెంట డీఎఫ్ఓ మోహన్, ఆర్డీఓ చంద్రమోహన్, తహసీల్దార్ పీఎల్.గంగాధర్, సర్వే డిప్యూటీ ఇన్స్పెక్టర్ అంబర్సింగ్, ఎఫ్ఆర్ఓ నజీబుద్దీన్లు ఉన్నారు.