పబ్‌లో చిన్నారి డాన్స్‌ వైరల్‌.. పోలీసుల సీరియస్‌

Hyderabad: 10 Years Below Girl Dance In Public Goes Viral - Sakshi

‘ది లాల్‌ స్ట్రీట్‌’ నిర్వాహకులపై కేసు నమోదు

బార్‌ అండ్‌ రెస్టారెంట్‌అనుమతితో పబ్‌ నిర్వహణ

మ్యూజిక్‌కు అనుమతి లేదన్న గచ్చిబౌలి పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: పబ్‌లో ఓ చిన్నారి డ్యాన్స్‌ చేయడం వైరల్‌గా మారింది. చిన్నారిని లోనికి అనుమతించినందుకు  పబ్‌ నిర్వాహకులపై గచి్చ»ౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గచి్చ»ౌలిలోని ఎస్‌ఎల్‌ఎన్‌ టెర్మినస్‌లోని రెండవ అంతస్తులో ‘ది లాల్‌ స్ట్రీట్‌’ పబ్‌ ఉంది. ఆదివారం రాత్రి ఓ మహిళ ఇద్దరు కూతుళ్లతో పబ్‌కు వచ్చింది. ఆరేళ్ల కూతురు తండ్రి, అతడి స్నేహితులతో కలిసి డ్యాన్స్‌ చేసింది. చిన్నారి డ్యాన్స్‌ను వీడియో తీసిన ఓ వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐ గోనె సురేష్‌ పబ్‌లోని సీసీ ఫుటేజీని స్వా«దీనం చేసుకున్నారు. వివరాలు సేకరిస్తున్నట్లు మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. మద్యం తాగిన 11మందితో పాటు మరో నలుగురు మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి వచి్చనట్లు ఆయన పేర్కొన్నారు. మద్యం తాగిన చోట చిన్నారిని డ్యాన్స్‌ వేయించడం నిబంధనలకు విరుద్దమన్నారు. పబ్‌ యజమాని మహవీర్‌ అగర్వాల్, చీఫ్‌ మేనేజర్‌ దీపక్‌లపై ఐపీసీ 188 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశామని అన్నారు. తల్లిదండ్రులను పిలిపించి ప్రశి్నస్తామన్నారు.  

ఎలాంటి అనుమతి లేదు.. 
ద లాల్‌ స్ట్రీట్‌ పబ్‌కు బార్‌ అండ్‌ రెస్టారెంట్‌గా మాత్రమే అనుమతి ఉన్నట్లు శేరిలింగంపల్లి ఎక్సైజ్‌ సీఐ గాంధీ తెలిపారు. డ్యాన్స్‌ ఫ్లోర్‌తో తమకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. బార్‌ అండ్‌రెస్టారెంట్‌లో నిబంధనలకు వి రుద్ధంగా పబ్‌ నిర్వహిస్తున్నారు. మ్యూజిక్‌ కోసం ఎలాంటి అనుమతి లేదని గచి్చ»ౌలి పోలీసులు తెలిపారు.   

చదవండి: Mahesh Babu: సూపర్‌ స్టార్‌కు పెరిగిన ఫాలోయింగ్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top