వీడి తెలివి సల్లగుండ.. ఇళ్లంతా ఐరన్‌తోనే నిర్మాణం  | HYD: Man Construct The House With Iron | Sakshi
Sakshi News home page

అతి తెలివి అంటే ఇదే.. ఇళ్లంతా ఐరన్‌తోనే నిర్మాణం 

Apr 21 2021 2:28 PM | Updated on Apr 21 2021 5:32 PM

HYD: Man Construct The House With Iron - Sakshi

ఆర్టీసీకాలనీలో ఐరన్‌తో చేపట్టిన నిర్మాణం  

సాక్షి, సైదాబాద్‌: అనుమతులు లేకుండా నిర్మాణం చేపడితే కూల్చేస్తారని అతి తెలివితో ఓ వ్యక్తి ఐరన్‌తో నిర్మాణం చేపట్టాడు. ఐఎస్‌సదన్‌ డివిజన్‌ ఆర్టీసీకాలనీలో ప్రధాన రహదారికి ఆనుకొని ఐరన్‌తో జీ–ప్లస్‌ వన్‌ను నిర్మించాడు. శ్లాబు, గోడలు, మెట్లు అంతా ఐరన్‌తోనే నిర్మించడం గమనార్హం. కింది భాగంలో నాలుగు షెట్టర్లను ఏర్పాటు చేశాడు. ఈ అక్రమ నిర్మాణాన్ని స్థానికులు జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సదరు నిర్మాణదారుడికి నోటీసులు ఇచ్చామని టౌన్‌ప్లానింగ్‌ అధికారి మల్లీశ్వర్‌ తెలిపారు. స్పందించకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement