కాసేపట్లో దుబాయ్‌కి.. సినీఫక్కీలో అడ్డగింత | hit and run accused rahil amir stopped at airport hyderabad | Sakshi
Sakshi News home page

కాసేపట్లో దుబాయ్‌కి.. సినీఫక్కీలో అడ్డగింత

May 2 2026 8:25 AM | Updated on May 2 2026 8:25 AM

hit and run accused rahil amir stopped at airport hyderabad

బంజారాహిల్స్‌: హిట్‌ అండ్‌ రన్‌ కేసులో నిందితుడైన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు మహ్మద్‌ రాహీల్‌ ఆమిర్‌ చట్టవిరుద్ధంగా దుబాయ్‌కి వెళ్లడానికి ప్రయతి్నంచగా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. రాహీల్‌ 2022 మార్చి 17న ఇద్దరు స్నేహితులతో కలిసి జూబ్లీహిల్స్‌ రోడ్డునెంబర్‌–45 మీదుగా కారులో బయలుదేరాడు. కారు బెలూన్లు అమ్మే మహిళను ఢీకొట్టగా, ఆమె చేతిలోంచి చిన్నారి కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు తన స్నేహితుడు అఫ్రాన్‌ కారు నడిపాడంటూ పోలీసులకు తప్పుడు సమాచారమిచ్చాడు. 

ఆ తెల్లవారే దుబాయ్‌ పారిపోయాడు.   ఆ రోజు కారు నడిపింది రాహీల్‌ అని పోలీసులు విచార ణలో తేలింది. దీంతో ఆయనపై కూడా కేసు నమోదు చేశారు. ముందస్తు బెయిల్‌ కోసం రాహీల్‌ హైకోర్టును ఆశ్రయించగా పోలీసుల విచారణకు హాజరుకావాలంటూ స్పష్టం చేసింది. దీంతో గత నెల 17న జూబ్లీహిల్స్‌ పోలీసుల ఎదుట హాజరయ్యాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం దుబాయ్‌కు వెళ్లేందుకు ఫ్లైట్‌ టికెట్‌ కూడా బుక్‌ చేసుకున్నాడు. సమాచారం అందుకున్న  పోలీసులు ఇమ్మి గ్రేషన్‌ అధికారులను అప్రమత్తం చేసి అతడిని మార్గమధ్యంలోనే అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం మరోమారు రాహీల్‌ విచారణకు రాగా, దుబాయ్‌ వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇవ్వలేదని చెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement