హిందూ పండుగలపై సర్కారు వివక్ష 

Hindu Community Protest Against TRS Government For Discriminating Hindu In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌: రాష్ట్రంలోని సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలోని తెలంగాణ సర్కారు హిందూ సమాజంపై వివక్ష చూపుతోందని విశ్వహిందు పరిషత్‌ నాయకులు కేశిరెడ్డి జయపాల్‌ రెడ్డి, కట్ట రమేశ్‌ అన్నారు. గణేశ్‌ ఉత్సవాలపై ఆంక్షలు, నిర్బంధాలు విధించడాన్ని నిరసిస్తూ సోమవారం విశ్వహిందు పరిషత్, భజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నల్ల జెండాలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ కార్యక్రమాలు నిర్వహించారు. హన్మకొండలో కాళోజీ కూడలిలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రంజాన్, బక్రీద్‌ సమయంలో స్వేచ్ఛ ఇచ్చిన సీఎం కేసీఆర్‌ బోనాలు, వినాయక చవితి పండుగలకు ఆంక్షలను విధించడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.

ఓవైసీకి తొత్తుగా మారిన సీఎం కేసీఆర్‌ హిందు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసుల అనుమతితో హిందు పండుగలు నిర్వహించుకోవాల్సి రావడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమాల్లో ఆయా సంఘాల నాయకులు సంతోష్‌కుమార్, ఆలకట్ల సాయి కుమార్, వలస అశోక్, నక్క పూర్ణచందర్, కిరణ్‌ చౌదరి, తాడిశెట్టి శ్రీధర్, వాడపల్లి సురేష్, మనోహర్, రఘు, శ్రీకాంత్, సందీప్, వంశీ, రమేశ్, నవీన్, దీపు, శ్రావణ్‌ కుమార్, రాజేశ్‌ ఖన్నా, మోడెం పూర్ణ, జగదీష్, యశ్వంత్, మనిదీప్, సురేందర్‌తో పాటు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.  హన్మకొండ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్‌రెడ్డి, వీహెచ్‌పీ, బీజేపీ నాయకులు కట్ల రమేష్, చిక్కుడు సంతోష్, అల్లకట్ల సాయికుమార్, వలస అశోక్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top