హైదరాబాద్‌లో భారీ వర్షం.. రెండు గంటల పాటు జాగ్రత్త | Heavy Rain Fall And THUNDERSTORMS In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో భారీ వర్షం.. రెండు గంటల పాటు జాగ్రత్త

Oct 5 2025 7:44 AM | Updated on Oct 5 2025 11:43 AM

Heavy Rain Fall And THUNDERSTORMS In Hyderabad

తెలంగాణలో వర్షం అప్‌డేట్స్‌..

మరో రెండు గంటల్లో మెదక్‌, కామారెడ్డి, సిద్దిపేట, జనగామ, సిరిసిల్ల, నిజామాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్‌, హన్మకొండ, వరంగల్‌, ఖమ్మంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. 

👉ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. బేగంపేట వద్ద రోడ్డుపై నీరు నిలిచిపోయింది. 

హైదరాబాద్‌లో(Hyderabad Rains) మళ్లీ వర్షం ప్రారంభమైంది. ఆదివారం ఉదయం నుంచి బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, ఎస్‌ఆర్‌ నగర్‌, మెహిదీపట్నం, మాసబ్‌ట్యాంక్‌, కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల, బాలానగర్‌, మూసాపేట, కూకట్‌పల్లి సహా పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. మరో రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 

 

మరోవైపు.. తెలంగాణలోని సంగారెడ్డి, మేడ్చల్‌, యాదాద్రి, వికారాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, నాగర్‌ కర్నూల్‌ సహ పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement