
కుషాయిగూడ: కుటుంబంలోని విభేదాలతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శనివారం చర్లపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. చర్లపల్లిలోని మధుసూదన్‌రెడ్డినగర్‌కు చెందిన బత్తుల గోపాల్, ప్రసన్న దంపతులు గత మే నెలలో విడాకులు తీసుకున్నారు.
ఈ క్రమంలో వారి కుమార్తె సృష్టిత (21) తల్లి ప్రసన్నతో కలిసి మధుసూదన్‌రెడ్డినగర్‌లో ఉంటుండగా...భర్త వేరుగా ఉంటున్నాడు. సృష్టిత డిగ్రీ చదువుతుండగా, తల్లి ప్రైవేటుగా ఉద్యోగం చేస్తుంది. శుక్రవారం ప్రసన్న రోజులానే ఉద్యోగానికి వెళ్లింది. ఆ సమయంలో కూతురు సృష్టిత ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ రోజు మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో తల్లి కుమార్తెతో ఫోన్‌లో మాట్లాడింది. తిరిగి సాయంత్రం 6:30 గంటలకు మరోమారు ఫోన్ చేస్తే సృష్టిత ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
పలుమార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఆందోళన చెందిన తల్లి ఇంట్లో కిరాయిదారులకు ఫోన్ చేసి కూతురు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడాన్ని తెలిపి ఇంటికి వెళ్లి చూడమని కోరింది. వారు తలుపు తట్టి ప్రయతి్నంచినా ఎలాంటి సమాధానం రాలేదు. తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా సృష్టిత తన గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. దీంతో విషయాన్ని తల్లి ప్రసన్నకు తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా తల్లిదండ్రుల మధ్య ఉన్న విభేదాల వల్లే మనస్థాపం చెంది యువతి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.