
బంజారాహిల్స్: నేను జీవితంలో చాలా తప్పులు చేశాను... ఇక మళ్లీ అలాంటి తప్పులు చేయను అంటూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసిన ఓ నటికి కాబోయే భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... రాజస్థాన్‌కు చెందిన సోహాని బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు పలు భాషల్లో సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల ఆమెకు రాజస్తాన్‌కు చెందిన సవాయ్ సింగ్ అనే యువకుడితో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. గత జూలైలో ఇద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లోని ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్న సోహాని కుమారి అక్కడే ఉంటూ సినిమాల్లో నటిస్తోంది.
శనివారం ఉదయం సవాయ్ సింగ్ ప్రశాసన్‌నగర్‌లోని ఆమె ఇంటికి వచ్చాడు. తర్వాత ఇద్దరూ కలిసి గచి్చ»ౌలిలోని ఎవరి కార్యాలయాలకు వారు వెళ్లి పోయారు. సాయంత్రం సోహాని ఇంటికి వచ్చి తాళం తీసి లోపలికి వెళ్లి చూడగా డైనింగ్ హాల్‌లో సవాయ్ సింగ్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఆత్మహత్య చేసుకునే ముందు అతను సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు గుర్తించారు.
సోహాని కుమారితో పరిచయానికి ముందు సవాయ్ సింగ్‌కు మరో యువతితో స్నేహం ఉండేదని ఆమెను మర్చిపోలేకపోవడం, ఆర్థిక సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోహాని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలించగా శుక్రవారం ఉదయం 11.47 గంటలకు సవాయ్ సింగ్ ఆమె ఉంటున్న ఫ్లాట్ వెనుక డోర్ ద్వారా ఇంట్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకునిని దర్యాప్తు చేపట్టిన పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. ఆయన మాజీ స్నేహితురాలిని కూడా విచారిస్తున్నారు.