సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 1.62 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో 70,804 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి కలగనుంది. జనవరి 1 నుంచి డీఏ పెంపు అమలు కానుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.