
మద్యం మత్తులో కారుపైకి ఎక్కిన యువకుడి అరెస్టు
హైదరాబాద్: మద్యం మత్తులో రోడ్డుపై వెళుతున్న కారు పైకి ఎక్కి కారులో ఉన్న వ్యక్తులను భయభ్రాంతులకు గురి చేసిన యువకుడిని కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఓ షాపులో అతను రూ. 32 ఆన్‌లైన్ పేమెంట్ చేయడంతో దాని ఆధారంగా అతడిని గంటలోపే అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఐ గిరీష్ కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... విశాఖపట్నం జిల్లా పెద్ద గోగాడ గ్రామానికి చెందిన సింహాచలం నాయుడు మూసాపేటలోని బాయ్స్ హాస్టల్‌లో ఉంటూ వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి అతను మూసాపేట చౌరస్తాలోని వైన్‌షాపులో మద్యం తాగాడు.
మద్యం మత్తులో అమీర్‌పేట నుంచి కూకట్‌పల్లికి వెళుతున్న ఓ కారును అడ్డుకుని దాని పైకి ఎక్కి కూర్చున్నాడు. దీంతో భయాందోళనకు గురైన కారులో ఉన్న వ్యక్తులు అతడిని కిందకు దిగాలని బతిమాలినా ససేమిరా అన్నాడు. దీంతో స్థానికులు జోక్యం చేసుకుని అతడిని కిందకు దింపి కారును పంపించి వేశారు. సదరు వీడియో వైరల్ కావటంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్‌ఐ గిరీష్ కుమార్ నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు. ఆన్‌లైన్ పేమెంట్ ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో అదుపుతప్పిన లా అండ్ ఆర్డర్
గంజాయి మత్తులో నడిరోడ్డుపై యువకుల హల్చల్
మూసాపేట్లో నడిరోడ్డుపై కారును ఆపిన గంజాయి బ్యాచ్
గంజాయి మత్తులో కారు ఎక్కి హల్చల్ చేసిన యువకుడు
భయబ్రాంతులకు గురైన కారులోని కుటుంబం pic.twitter.com/2TybqwpfJC— Telugu Scribe (@TeluguScribe) July 23, 2025