మంచిర్యాలకు.. ధమ్‌ కి బిర్యానీ.. ‘మండి.. పదండి..’

Food Lovers: Special Chicken Dum Biryani In Adilabad - Sakshi

ఆదివారమో, పండుగనో, ప్రత్యేక సందర్భం వచ్చిందంటే మాంసాహారం సాధారణంగా ఇళ్లలో ఉండే మెనూ ఇదే. కానీ రానురాను అభిరుచులు మారిపోతున్నాయి. ఓ రోజు అలా రెస్టారెంట్‌కు వెళ్లి, కొత్త రుచులను చూసేద్దాం అంటున్నారు పట్టణ ప్రజలు. సెలవు రోజుల్లో, పిల్లలు, పెద్దల పుట్టిన రోజులు, ఇతర వేడుకలు వచ్చాయంటే అంతా కలిసి సరదాగా రెస్టారెంట్‌కు వెళ్తున్నారు. అక్కడా కూడా ఎప్పటి మాదిరి చికెన్‌ బిర్యాని, మటన్‌ బిర్యానీలే కాకుండా వెరైటీ రుచులపై దృష్టిసారిస్తున్నారు. ఇలా మారుతున్న ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా రెస్టారెంట్లు ఏర్పాడుతున్నాయి. హైదరాబాద్‌ ధమ్‌కీ బిర్యాని అంటే ఎంత ఫేమసో... ఇప్పుడు మండి బిర్యాణి అంతే ఫేమస్‌గా మారుతోంది. ఈ బిర్యానిపై సండే స్పెషల్‌ కథనం మీకోసం.

సాక్షి, మంచిర్యాల(ఆదిలాబాద్‌):  హైదరాబాద్‌ దమ్‌కీ బిర్యానీలో మసాలా ఎక్కువగా ఉంటుంది. బిర్యానీలో వచ్చే చికెన్, మటన్‌ ముక్కలు ఉడికించి ఉంటాయి. కానీ మండి బిర్యానీలో మాత్రం మసాల చాలా తక్కువగా ఉంటుంది. కాజు, కిస్‌మిస్, డ్రైఫ్రూట్స్‌లతో పాటు, క్యారెట్, కొతిమీర తదితర వాటిని వేసి మండి బిర్యానినీ తయారు చేస్తారు. బిర్యానిని వేరుగా, చికెన్, మటన్‌ ముక్కలను వేరుగా చేసి, వాటిని ఒక్కచోట చేర్చి చికెన్, మటన్‌ మండి బిర్యానీలుగా చేస్తారు.

ఈ మండి బిర్యాని ఎక్కువగా పాశ్చత్య దేశాలైన అరబ్, సౌదీ దేశాల్లో బాగా ఫేమస్, అయితే గత ఐదేళ్లుగా మంచిర్యాలలో అరేబియన్‌ నైట్స్, నవాబ్‌ వంటి పలు రకాల పేర్లతో మండి బిర్యాని కేంద్రాలు మంచిర్యాలలో ఐదు వరకు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్‌ బిర్యానికి ఉన్న క్రేజ్‌ మండి బిర్యానికి ఉండడంతో, మాంసాహారులు దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరు ఇంట్లో మాదిరిగా తినేలా టేబుళ్లను వేయకుండా, కిందనే పరుపులు వేసి మధ్యలో చిన్న టేబుల్‌ను ఏర్పాటు చేశారు.

ఒకే ప్లేటులో తీసుకువచ్చే బిర్యానిని కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి తినేవిధంగా ఏర్పాటు చేశారు. హాయిగా కింద కూర్చోని ప్రశాంతంగా మండి బిర్యాని తింటుంటే ఆ మజానే వేరు. ఫ్యామిలీతో వచ్చే వారికి, స్నేహితులతో వచ్చే వారికి వేర్వేరుగా మండి బిర్యాని తినేలా ఏర్పాట్లు చేయడంతో ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.

చదవండి: ఆ ధైర్యంతోనే.. దొంగ ప్యాంట్, నడుము పట్టుకుని గట్టిగా లాగినా

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top