కాగితపు జాతీయ పతాకాలనే వినియోగించాలి

Flag Code Of India Says Use Paper National Flags To Decorate - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ జాతీయ దినోత్సవాలు, క్రీడలు, సాంస్కృతిక దినోత్స వాలను పురస్కరించుకుని అలంకరణ కోసం వినియోగించే జాతీయ పతాకాలను కాగితం తో తయారు చేసిన వాటినే ఉపయోగించాలని ఫ్లాగ్‌ కోడ్‌ ఆఫ్‌ ఇండియా–2002 (2021 సవరణ) స్పష్టం చేస్తోంది. జాతీయ పతాకం గౌరవాన్ని కాపాడేలా కాగితపు పతాకాలను వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు, పోలీసు విబాగాధిపతులకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్లాస్టిక్‌తో రూపొం దించిన జెండాలను తొలగించి డిస్పోజ్‌ చేసే క్రమం కాస్త కఠినంగా ఉందని, అందువల్లే కాగితపు జెండాలను వాడితే గౌరవ ప్రదంగా వాటిని డిస్పోజ్‌ చేయవచ్చని అందులో పేర్కొన్నారు. వి విధ సంస్థలు, యాజమాన్యాలు జెండా కార్యక్రమం ముగి సిన తర్వాత తొలగించేటప్పుడు జాతీయ పతాక గౌర వాన్ని భంగం కలిగించకుండా చర్యలు తీసుకోవాలని, జా తీయ పతాక నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top