ఈనెల 28, 29 తేదిల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ప్రవేశ పరీక్షలు

Emcet  Agriculture Entrance Examinations On 28th 29th Of September - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో విద్యా వ్యవస్థతోపాటు అనేక ఎంట్రన్స్‌ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. అయితే లాక్‌డౌన్‌ సడలింపులతో తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ ఖరారైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 28, 29 తేదిల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ మేర‌కు తెలంగాణ ఉన్న‌త విద్యామండ‌లి సోమవారం ఒక ప్ర‌క‌ట‌న విడుదల చేసింది. (తెలంగాణ వ‌చ్చాకే అన్నీ మెరుగ‌య్యాయి)

ఆన్‌లైన్‌ ద్వారా జేఎన్టీయూ ఈ పరీక్ష నిర్వహించనుంది. మొత్తం 84 పరీక్ష కేంద్రాల్లో 67 తెలంగాణ, 17 ఏపీ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 7,970 మంది పరీక్షకు హాజరు కానున్నారు. రెండు రోజులపాటు రెండు సెషన్స్‌లో పరీక్షలు జరగనున్నాయి. ఈ రోజు నుంచి ఆ నెల 25 వరకు వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్స్‌ అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top