breaking news
telangana higher education
-
ఎమర్జింగ్ కోర్సులు.. సిలబస్ సవరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నతవిద్యలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నెల 29వ తేదీన జరిగే విశ్వవిద్యాలయాల వీసీల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి ఇందుకు సంబంధించిన విధివిధానాలపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. సమావేశంలో చర్చించబోయే అంశాలతో కూడిన ఎజెండాను వీసీలకు పంపారు. దీనిపై పూర్తి సమాచారంతో రావాలని ఆయన సూచించారు. డిగ్రీ, పీజీ కోర్సుల ప్రక్షాళనపై కొన్ని నెలలుగా మండలి దృష్టి పెట్టింది. నిపుణులతో కమిటీలు కూడా వేసింది. నిపుణుల నివేదికల ఆధారంగా సిలబస్‌పై తుది నిర్ణయానికి వచ్చారు. అన్ని యూనివర్సిటీల వీసీలతో కలిసి సమావేశంలో అమలుకు సంబంధించిన తీర్మానం చేయనున్నారు. డిగ్రీ, పీజీ కోర్సులకు సాంకేతికత జోడించేలా.... డిగ్రీ, పీజీ కోర్సులకు సాంకేతికతను జోడించనున్నారు. సంప్రదాయ డిగ్రీ కోర్సుల స్థానంలో కంప్యూటర్ సైన్స్, డేటా, ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఎమర్జింగ్ కోర్సులు అందుబాటులోకి తెస్తారు. ప్రతీ కోర్సులోనూ కనీసం 20 శాతం కంప్యూటర్ ఆధారిత సిలబస్ ఉంటుంది. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా వీటిని తీర్చిదిద్దాలని ప్రతిపాదించారు. క్లాస్ రూంలో థియరీ బోధనతోపాటు, పరిశ్రమల్లో నైపుణ్యం పెంచేలా కోర్సులను డిజైన్ చేశారు. ఎమర్జింగ్ కోర్సులు అందించే కాలేజీలు విధిగా నైపుణ్యం అందించే పరిశ్రమలతో భాగస్వామ్యం కలిగి ఉండేలా మార్పులు చేయబోతున్నారు. పవర్ ఫుల్ పీజీ పోస్టు–గ్రాడ్యుయేషన్ కోర్సులకు కొన్నేళ్లుగా ఆదరణ తగ్గుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని పీజీ కోర్సుల ఉన్నతిని పెంచాలని కౌన్సిల్ నిర్ణయించింది. అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల నుంచి ఆధునిక సాంకేతిక సిలబస్‌ను అందించడం, దీన్ని పీజీ స్థాయిలో ఉన్నతీకరించడం చేస్తారు. పీహెచ్డీ, ఇతర ప్రొఫెషనల్ కోర్సులకు అంతర్జాతీయ స్థాయి కల్పించేలా మార్పులు తెస్తున్నారు. బోధన ప్రణాళికను వివిధ అంతర్జాతీయ వర్సిటీలు, విద్యాసంస్థల మేళవింపుతో తీర్చిదిద్దనున్నారు. పీజీ మరింత పవర్ ఫుల్‌గా అందించడం దీని ఉద్దేశమని మండలి వర్గాలు తెలిపాయి. పీజీ, యూజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల ఆలస్యాన్ని నివారించే విధానాలపై సమావేశంలో చర్చిస్తారు. వైమానిక, రక్షణ రంగంలో.. వైమానిక, రక్షణ రంగంలో ఉపాధి అవకాశాలకు పెరగబోతున్నాయని అంతర్జాతీయ సర్వేలు చెబుతున్నాయి. ఏరోస్పేస్లో సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిస్ట్‌లు, ఏఐ ఆధారిత ఉద్యోగ అవకాశాలకు మంచి భవిష్యత్ ఉండబోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో ఈ రంగంలో కోర్సులపై దృష్టి పెట్టాలని మండలి భావించింది. ఏరోస్పేస్, డిఫెన్స్ సెక్టార్లలో ఎలాంటి కోర్సులు అందించాలనే దానిపై వీసీల సమావేశంలో చర్చిస్తారు. ఇదే క్రమంలో అంతర్జాతీయంగా కోర్సుల డిజైన్, ఉపాధి అవకాశాలపై అందుబాటులో ఉన్న డేటాను పరిశీలిస్తారు. జీరో అడ్మిషన్లు ఉంటే నో పర్మిషన్ త్వరలో అకడమిక్ ఆడిట్ చేపట్టబోతున్నారు. అన్ని యూనివర్సిటీల పరిధిలో ఇందుకు సంబంధించిన కసరత్తు మొదలవుతుంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఉపయోగం లేని కోర్సులను ఎత్తివేయాలని భావిస్తున్నారు. కనీసం 25 శాతం విద్యార్థులు లేని సెక్షన్లు, కోర్సులు, కాలేజీలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు. దీనిపై వీసీల సమావేశంలో ఒక తీర్మానం చేసే వీలుందని మండలి వర్గాలు తెలిపాయి. వర్సిటీల పరిధిలోని అన్ని కాలేజీల్లో కొన్నేళ్లుగా అందుబాటులో ఉన్న కోర్సులు, విద్యార్థుల చేరికలపై వివరాలు ఇవ్వాలని మండలి వీసీలను కోరింది.వచ్చే ఏడాది నుంచే మార్పులు ఉన్నతవిద్యలో గుణాత్మక మార్పులు చేస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ మార్పులు అమలులోకి రాబోతున్నాయి. నైపుణ్యం, అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు అందుకోగల స్థాయికి పీజీ, డిగ్రీ కోర్సులను తేవడమే దీని లక్ష్యం. – ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్) -
హైటెక్ హంగులు.. అంతర్జాతీయ ప్రమాణాలు
రాష్ట్ర విద్యా రంగాన్ని దేశంలో నంబర్ వన్ స్థాయికి తీసుకెళ్ళేందుకు విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. హైటెక్ హంగులతో, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సంస్కరణలు ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. డిసెంబర్లో జరగబోయే గ్లోబల్ సమ్మిట్‌ను దృష్టిలో ఉంచుకుని ‘తెలంగాణ ఉన్నత విద్య విజన్–2047’ డాక్యుమెంట్‌ను ఆయన రూపొందించారు. దీనిపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) క్రోడీకరణతో కూడిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను శనివారం ముఖ్యమంత్రి వద్ద ఉంచనున్నారు. ‘సాక్షి’కి ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చిన ఈ డాక్యుమెంట్‌లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.రూ.లక్ష కోట్ల పెట్టుబడి అవసరం⇒ విద్యా రంగం ప్రమాణాలు మెరుగుపర్చడానికి 2047 నాటికి రూ.లక్ష కోట్లు అవసరం. ప్రస్తుతం ప్రభుత్వం సుమారు రూ.21 వేల కోట్లు ఇస్తోంది. వచ్చే 20 ఏళ్ళూ ప్రతీ ఏటా రూ.5 వేల కోట్ల చొప్పున రూ.లక్ష కోట్ల నిధులు సమకూర్చాలి. అయితే ఈ మొత్తం ప్రభుత్వమే సమకూర్చడం సాధ్యం కాదు కాబట్టి ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానించాలి. ⇒ నిధులను ఆధునిక మౌలిక సదు పాయాలు, డిజిటల్ ఎడ్యుకేషన్, అధ్యాపక శిక్షణ, పరిశోధన–ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ విద్య భాగస్వామ్యాలను విస్తరించేందుకు వినియోగించాలి. దీనివల్ల ఉన్నత విద్యలో సగటు ప్రవేశాల శాతం 38 నుంచి 20 ఏళ్ళల్లో 70 శాతానికి చేరే అవకాశం ఉంది.⇒ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిటీకి 300 నుంచి 500 ఎకరాలు మొదటి దశలోనే కేటాయించాలి. పీపీపీ మోడల్లో బహుళ విశ్వవిద్యాలయ నగరం ఏర్పాటు, భవిష్యత్ అవసరాల కోసం దీనిని వెయ్యి ఎకరాల వరకూ విస్తరించాలి. ⇒ అంతర్జాతీయ పరిశోధన కేంద్రాలు, ఆవిష్కరణల హబ్‌లు, ఎడ్యూటెక్ కంపెనీలు, స్టార్టప్ యాక్సిలరేటర్లు అన్నీ ఒకే క్యాంపస్‌లో ఉండేలా చూడాలి.నైపుణ్య శిక్షణ పెంచాలి⇒ బీటెక్, డిగ్రీ, ఎంబీఏ ఇతర మేనేజ్ మెంట్, సాంకేతిక కోర్సులను రీ డిజైన్ చేయాలి. అంతర్జాతీయ సాంకేతికతకు అనుగుణంగా వీటిని మార్చుకోవాలి. బీటెక్ చేసినా 80 శాతం మంది నైపుణ్యం సమస్యను ఎదుర్కొంటున్నారు. మౌలిక వసతులు, చదుకునే సమయంలో మంచి నైపుణ్య శిక్షణ పెంచే పారిశ్రామిక భాగస్వామ్యంతో ఈ సమస్యకు చెక్ పెట్టాలి.⇒ ఉద్యోగాలు సృష్టించే యువతను తయారు చేయాలంటే ముందుగా వారికి మౌలిక సదుపాయాలు, ఆధునిక టెక్నాలజీని సులభంగా అందుబాటులోకి తేవాలి. ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటులో ఈ తరహా ప్రయత్నాలు సాగాలి. ⇒ బోధన సిబ్బందికి మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. ఐటీ రంగంలో ఉన్నతులైన వారిని శిక్షణకు, బోధనకు ఉపయోగించుకునే సరికొత్త వ్యవస్థను సృష్టించాల్సిన అవసరం ఉంది.ప్రభుత్వం విజయవంతం అయ్యేలా డాక్యుమెంట్ రాష్ట్రంలో వనరులున్నాయి. యువతలో చైతన్యం ఉంది. మారుతున్న సాంకేతికత అందుకుని, నైపుణ్యం పెంచుకోవడంలో మరింత కృషి జరగాలి. ప్రభుత్వమే వేల కోట్ల రూపాయలు వెచ్చించడం సాధ్యం కాదు. అందువల్ల పెట్టుబడులను ఆహ్వానించి, ప్రమాణాలు పెంచడం ద్వారా ప్రభుత్వం విజయవంతమయ్యే దిశగా విజన్–2047 డాక్యుమెంట్ తయారు చేశాం. – ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యా మండలి -
ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా లింబాద్రి నియామకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ ఆర్ లింబ్రాది నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడేళ్ల పాటు లింబాద్రి ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇన్చార్జి ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. గత ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి పదవీ కాలం ముగిసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అదే విధంగా ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్‌గా ఎస్కే మహమూద్‌ను నియామకమయ్యారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ బోటనీ ప్రొఫెసర్‌గా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. -
కాలేజీ ఏదైనా ఒక సబ్జెక్టుకు ఓకే
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా ఉన్నతవిద్యను ఆధునీకరించాలని అఖిలభారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) చర్యలు చేపడుతోంది. ఈ మేరకు పలు మౌలిక మార్పులకు ఆమోదం తెలుపుతూ తాజాగా హ్యాండ్‌బుక్ విడుదల చేసింది. నాణ్యతలేని కాలేజీల ఏర్పాటును అడ్డుకునేందుకు కఠిన నిబంధనలు పొందుపర్చింది. సాంకేతిక విద్యాకాలేజీల ఏర్పాటుకు పారిశ్రామిక భాగస్వామ్యం అవసరమని పేర్కొంది. విద్యార్థికి సరిహద్దుల్లేని అభ్యాసానికి వీలు కల్పించింది. వచ్చే విద్యాసంవత్సరం (2022–23) నుంచి చేయాల్సిన మార్పులను ఇందులో స్పష్టం చేసింది. ఎక్కడైనా ఓ కోర్సు ఒక్కోకాలేజీలో ఒక్కో కోర్సుకు ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో చోట మౌలిక వసతులు, లైబ్రరీ సదుపాయం వంటివి అత్యంత ప్రాధాన్యంగా కన్పిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో విద్యార్థి ఏ కాలేజీలో చేరినా, మరో నచ్చిన కాలేజీలో ఒక సబ్జెక్టు పూర్తిచేసే అవకాశం కల్పించింది. ఈ కాలేజీలు సంబంధిత యూనివర్సిటీ పరిధిలో, ఒకే నెట్‌వర్క్‌లో ఉండాలని పేర్కొంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి గతేడాది ఈ తరహా ప్రయోగం చేసింది. హైదరాబాద్‌లోని కొన్ని కాలేజీల నెట్‌వర్క్‌లో ఒక సబ్జెక్టు పూర్తి చేసే అవకాశం కల్పించింది. ఏఐసీటీసీ కూడా ఈ దిశగానే ఆలోచిస్తోంది. దీంతో విద్యార్థులు నాణ్యమైన బోధన అందుకోవచ్చు. ఆన్లైన్ కోర్సులకూ ఆమోదం అఖిల భారత సాంకేతిక విద్యామండలి విద్యార్థులకు మరో అవకాశం కల్పించింది. విస్తృత ఆన్లైన్ బోధన వ్యవస్థను సొంతం చేసుకునే దిశగా మార్పులు చేసింది. ఇంజనీరింగ్ కోర్సులు చేస్తున్న అభ్యర్థులకు భవిష్యత్‌లో ఉపాధి అవకాశాలు పెంచే ఇతర కోర్సును ఆన్లైన్లో పూర్తి చేసేందుకు అనుమతించింది. ఆ కోర్సు దేశ, విదేశాల్లో ఎక్కడున్నా నేర్చుకోవచ్చు. గుర్తింపుపొందిన సంస్థ ద్వారా కోర్సు పూర్తి చేస్తే.. ఆ సర్టిఫికెట్ చెల్లుబాటు అయ్యేలా ఉంటుందని స్పష్టం చేసింది. గణితం లేకున్నా... బ్రిడ్జ్ కోర్సు తప్పనిసరి సాధారణంగా ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థులు ఇంటర్మీడియట్‌ను గణితం సబ్జెక్ట్‌తో పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే, ఇతర రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో గణితం లేకుండా సైన్స్ గ్రూపులు కొనసాగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇంటర్లో గణితం లేకున్నా బయాలజీ, బయోటెక్నాలజీ, బిజినెస్ స్టడీస్, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పూర్తి చేసినవారు ఇంజనీరింగ్‌లో చేరవచ్చు. ఆర్కిటెక్చర్, బయోటెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీ వంటి డిగ్రీ కోర్సులు చేయడానికి ఇంటర్లో గణితం అక్కర్లేదని పేర్కొంది. అయితే, ఇలాంటి విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరినా, మరే ఇతర కోర్సుల్లో చేరినా ఒక సెమిస్టర్ విధిగా బ్రిడ్జి కోర్సు చేయాలి. దీన్ని ఆయా కాలేజీలే అందించాలి. అయితే ఈ విధానం ప్రస్తుతం తెలుగురాష్ట్రాల్లో అమలయ్యే అవకాశం కన్పించడంలేదని అధికారులు అంటున్నారు. కాగా, ఇంజనీరింగ్‌లో ప్రతీ బ్రాంచ్‌లోనూ రెండు సీట్లను కాలేజీ యాజమాన్యాలు పెంచుకునే స్వేచ్ఛను ఏఐసీటీఈ కల్పించింది. దీనికి ఎలాంటి అనుమతులు అక్కర్లేదని స్పష్టం చేసింది. -
ఉపాధి కల్పించేలా సంప్రదాయ కోర్సులు!
సాక్షి, హైదరాబాద్: సంప్రదాయ కోర్సుల ప్రామాణికతను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఈ దిశగా ఇప్పటికే చర్యలు చేపట్టింది. సంప్రదాయ డిగ్రీ కోర్సులైన బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరుతున్న వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఎక్కువగా ఉంటున్నారు. వీరిలో చాలామంది పేదరికం నేపథ్యము న్నవారే. ఈ కోర్సుల తర్వాత ఉపాధి పొందేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచ నైపుణ్యంతో పోటీపడే స్కిల్స్ లేవని, మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా విద్యావిధానం మెరుగుపడలేదని ఉన్నత విద్యామండలి గుర్తించింది. బీసీలే ఎక్కువ ఈ సంవత్సరం బీఏలో 36,888 మంది చేరితే వారిలో 18,240 మంది బీసీలే. వీరిలో 80 శాతం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ కోర్సులను ఎంచుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. 10 శాతం పీహెచ్డీ స్థాయి, మరో 10 శాతం పోటీ పరీక్షలకు వెళ్లాలనుకునేవారు ఉన్నట్టు అధికారుల సర్వేలో తేలింది. కొంతమేరైనా డిగ్రీ తర్వాత ఉపాధి కల్పించే కోర్సుల్లో బీకాంను చెప్పుకుంటారు. కానీ ఈ కోర్సులో ఎస్సీలు 15,518కి పరిమితమైతే, ఎస్టీలు 6,620 మంది ఉన్నారు. ఓసీలు 25,072 మంది ఉన్నారు. సరికొత్త ప్రయోగాలు ఉద్యోగం అవసరం ఉన్న పేద వర్గాలు ఇష్టపడే సంప్రదాయ కోర్సులను తీర్చిదిద్దేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ఇప్పటికే యూకేకు చెందిన రెండు యూనివర్సిటీలతో అవగాహన ఒప్పందం చేసుకుంది. అక్కడ బోధన ప్రణాళికను మేళవింపు చేస్తూ రాష్ట్రంలోని సంప్రదాయ కోర్సుల్లో మార్పులు తేవాలని భావిస్తోంది. ముఖ్యంగా బ్రిటన్ విద్యావ్యవస్థను ఆకళింపు చేసుకోవాలని యోచిస్తోంది. అయితే, ఆ స్థాయి ప్రమాణాలు అర్థం చేసుకోవడానికి వీలుగా పాఠ్య ప్రణాళిక ఉండాలని అధికారులు భావిస్తున్నారు. తాజాగా ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బీఏ ఆనర్స్, బీకాం ఆనర్స్ కోర్సుల్లో ఈ తరహా విద్యాబోధన అందిస్తున్నారు. క్షేత్రస్థాయి అధ్యయనం అవసరమని భావించినప్పటికీ, ఈ ప్రక్రియ ఇప్పటివరకూ సాధ్యం కాలేదు. సంప్రదాయ కోర్సులకు ఊతం పేద, గ్రామీణ విద్యార్థులు ఎక్కువగా చేరే సంప్రదాయ డిగ్రీ కోర్సు లను ఉపాధికి ఊతమిచ్చే స్థాయిలో తీర్చిదిద్దాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఇందుకు అనుగుణంగానే ఇతర దేశాలతో అవగాహన ఒప్పందం చేసుకున్నాం. దీనిపై కసరత్తు మొదలు పెట్టాయి. –ప్రొ. లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ మూస విధానం పోవాలి సంప్రదాయ డిగ్రీ కోర్సుల స్వరూప స్వభావం మారాలి. ప్రధానంగా మూస బోధన విధానం మారాలి. మన విద్యార్థులకు కష్టపడే తత్వం ఉంది. అర్థం చేసుకునే మేధస్సు ఉంది. కాకపోతే విద్యావిధానంలో మార్పులు అవసరం. –ప్రొ. డి.రవీందర్, ఉస్మానియా వర్సిటీ వీసీ -
గుడ్ న్యూస్: విద్యార్థులు రీషెడ్యూల్ చేసుకోవచ్చు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్, బిట్సాట్ పరీక్షలు ఒకేరోజు ఉన్న విద్యార్థుల కోసం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెసులుబాటు కల్పించింది. ఎంసెట్ తేదీని మార్చుకునే అవకాశం ఇచ్చింది. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్)లోని వివిధ కోర్సులలో ప్రవేశానికి బిట్సాట్–2021 పరీక్షను వచ్చే నెల 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఎంసెట్ పరీక్ష వచ్చే నెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఇంజనీరింగ్ కోర్సు విద్యార్థులకు నిర్వహిస్తారు. 9, 10 తేదీల్లో వ్యవసాయ, ఫార్మసీ కోర్సులు కోరుకునే విద్యార్థులకు ఉంటుంది. అయితే కొందరు విద్యార్థులకు ఒకే తేదీలో ఎంసెట్, బిట్సాట్ పరీక్షలు రెండూ ఉన్నాయి. దీంతో వారిలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా విద్యార్థులు ఎంసెట్ తేదీని మార్చుకునేలా వెసులుబాటు కల్పించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. బిట్‌సాట్‌కు ఒకరోజు ముందు లేదా తరువాత రోజుకు ఎంసెట్ తేదీని మార్చుకోవచ్చని చెప్పారు. ఈ మేరకు విద్యార్థులు ఈ–మెయిల్ (convener.eamcet@tsche.ac.in) ద్వారా ఎంసెట్ కన్వీనర్‌కు తమ అభ్యర్థనను పంపవచ్చు. ఇలావుండగా.. గత సంవత్సరం మాదిరిగానే ఎవరైనా కోవిడ్ పాజిటివ్‌తో ఐసోలేషన్‌లో ఉంటే ఎంసెట్ కన్వీనర్‌కు తెలియజేయాలి. ఎంసెట్ జరిగిన పది రోజుల తర్వాత వారికోసం ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. -
ఈనెల 28, 29న ఎంసెట్ అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో విద్యా వ్యవస్థతోపాటు అనేక ఎంట్రన్స్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. అయితే లాక్డౌన్ సడలింపులతో తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సెప్టెంబర్ 28, 29 తేదిల్లో ఎంసెట్ అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. (తెలంగాణ వచ్చాకే అన్నీ మెరుగయ్యాయి) ఆన్లైన్ ద్వారా జేఎన్టీయూ ఈ పరీక్ష నిర్వహించనుంది. మొత్తం 84 పరీక్ష కేంద్రాల్లో 67 తెలంగాణ, 17 ఏపీ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 7,970 మంది పరీక్షకు హాజరు కానున్నారు. రెండు రోజులపాటు రెండు సెషన్స్‌లో పరీక్షలు జరగనున్నాయి. ఈ రోజు నుంచి ఆ నెల 25 వరకు వెబ్సైట్లో హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొంది. -
ఎంసెట్‌లో ఇక బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు
సాక్షి, హైదరాబాద్ : ఎంసెట్ ‘సెట్’ నిబంధనలు సవరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంసెట్ ద్వారా భర్తీ అయ్యే ఇంజినీరింగ్, ఏజీ బీఎస్సీ, మెడికల్, వెటర్నరీ కోర్సులతో పాటుగా ఇక నుంచి బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సును కూడా పొందుపరిచారు. ఇక నుంచి బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు చదవాలనుకునే విద్యార్థులు ఎంసెట్ ద్వారనే అడ్మిషన్లు పొందాలి. బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు అభ్యసించే విద్యార్థుల కనిష్ట వయసు డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్లు, గరిష్ట వయసు జనరల్, బీసీ అభ్యర్థులకు 22 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ కులాల వారికి 25 ఏళ్లు ఉండే విధంగా నిబంధనలలో మార్పులు చేశారు. -
ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైన ఫీజులు
డిగ్రీ ఫీజుల నిర్ణయంలో యూనివర్సిటీల ఇష్టారాజ్యం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఒక్కో వర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ఒక్కో రకంగా ఫీజు విధానం పట్ల విద్యార్థులు, యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే కోర్సుకు ఉస్మానియాలో ఒక రకమైన ఫీజు, కాకతీయలో మరో రకమైన ఫీజు విధానం ఉంది. వర్సిటీలు నిర్ణయించిన ఫీజులు శాస్త్రీయంగా లేవన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ఒకే రకమైన ఫీజుల విధానం అమల్లోకి తేవాలని యాజ మాన్యాలు కోరుతున్నాయి. ఈ క్రమంలో ఏర్పడిన ఓయూ ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ బుధవారం తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, ఓయూ రిజిస్ట్రార్ సురేశ్‌కుమార్‌కు ఈ మేరకు వినతిపత్రం ఇచ్చింది. బీఎస్సీ ఎంపీసీఎస్‌కు రూ. 20వేలు, ఎంపీసీకి రూ.15 వేలు, ఎంఎస్‌సీఎస్‌కు రూ.20 వేలు, బీజెడ్‌సీకి రూ.20 వేలు... బీకాంలో కంప్యూటర్స్‌కు 20 వేలు, జనరల్‌కు రూ. 15 వేలుగా నిర్ణయించాలని కోరాయి. -
సెట్స్ షెడ్యూల్‌కు చర్యలు చేపట్టండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) షెడ్యూల్‌కు సంబంధించిన పనులు చేపట్టాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలిని విద్యా శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. సోమవారం సచివాలయంలో మంత్రితో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తదితరులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రవేశ పరీక్షల వ్యవహారంపై చర్చకు వచ్చినట్లు తెలిసింది. పదో షెడ్యూల్లో ఉన్న మండలి విభజనలో భాగంగా తెలంగాణ ఉన్నత విద్యా మండలిని టీ సర్కార్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయినా ఏపీ ఉన్నత విద్యామండలి విభ జనకు అధికారికంగా ఏపీ ప్రభుత్వం నుంచి ఆమోదం లభించలేదు. పదేళ్లపాటు 2 రాష్ట్రాల్లో ఉమ్మడి ప్రవేశాల విధానం అయినందున పరీక్షలను వేర్వేరుగా నిర్వహించాలా? కలిపి నిర్వహిద్దామా? అనేది తరువాత తేల్చుకుందామని, ముందుగా తెలంగాణలో షెడ్యూలుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించినట్లు సమాచారం.


