ఆవు పొట్టలో 80 కిలోల ప్లాస్టిక్‌  | Doctor Removes 80 Kgs Polythene Waste From Cow Stomach In Patancheru | Sakshi
Sakshi News home page

ఆవు పొట్టలో 80 కిలోల ప్లాస్టిక్‌ 

Oct 31 2020 8:48 AM | Updated on Oct 31 2020 8:48 AM

Doctor Removes 80 Kgs Polythene Waste From Cow Stomach In Patancheru - Sakshi

ఆవు పొట్ట నుంచి తీసిన ప్లాస్టిక్‌ వ్యర్థాలు

సాక్షి, పటాన్‌చెరు: అనారోగ్యంతో ఉన్న ఆవుకు ఆపరేషన్‌ చేసిన పశువైద్యులు దాని పొట్టలో నుంచి 80 కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించారు. వివరాల్లోకి వెళితే.. అనారోగ్యంతో ఉన్న 2 ఆవులను జీహెచ్‌ఎంసీ సిబ్బంది 20 రోజుల క్రితం అమీన్‌పూర్‌ గోశాలకు తరలించారు. వాటిలో ఒక ఆవు మూడ్రోజుల క్రితం మృతి చెందగా.. మరో ఆవు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో అమీన్‌పూర్‌ పశువైద్యాధికారి విశ్వచైతన్య ఆ ఆవుకు శస్త్ర చికిత్స చేసి దాని పొట్టలో పేరుకుపోయిన 80 కిలోల ప్లాస్టిక్, కాటన్‌ బట్టలు బయటకు తీశారు. ప్రస్తుతం ఆవు ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement