కరోనా లక్షణాలు లేకపోయినా టెస్టు చేయించుకోవచ్చా?

Doctor Advice Corona Vaccine Test - Sakshi

లక్షణాలు లేకపోయినా టెస్టు చేయించుకోవచ్చా? 
కరోనా లక్షణాలు లేకపోయినా తమకు వైరస్‌ సోకిందో లేదో నిర్ధారణ చేసుకునేందుకు టెస్టు చేయించుకోవచ్చు. దీనికి ఆర్టీపీసీఆర్‌ టెస్టే ఉత్తమం. అలాగే లక్షణాలు లేనప్పటికీ ఎవరైనా కరోనా పేషెంట్లతో క్లోజ్‌ కాంటాక్ట్‌లోకి వెళ్లామనుకున్నప్పుడు కూడా ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ చేసుకుంటే మంచిది. లక్షణాలుండి ఆర్టీపీసీఆర్‌లో నెగెటివ్‌ వస్తే వారు సీటీ స్కాన్‌ తో నిర్ధారణ చేసుకోవాలి. వందలో 30 మంది వరకు ఇలా జరగొచ్చు. లక్షణాలు ఏమీ లేకపోతే స్కానింగ్‌ అవసరం ఉండదు.  
- వీవీ రమణప్రసాద్,  పల్మనాలజీ,స్లీప్‌ డిజార్డర్స్‌ స్పెషలిస్ట్, కిమ్స్‌ ఆసుపత్రి, హైదరాబాద్‌  

ఫాల్స్‌ పాజిటివ్, ఫాల్స్‌ నెగెటివ్‌ అంటే ఏమిటి?
ఫాల్స్‌ పాజిటివ్‌ అంటే మనలో ఇన్ఫెక్షన్‌ లేకపోయినా నమూనాలో పాజిటివ్‌ రావడం. ఫాల్స్‌ నెగెటివ్‌ అంటే కరోనా సోకిఉన్నప్పటికీ టెస్టులో నెగెటివ్‌ రావడం. దీనికి ప్రధాన కారణాలు.. గొంతులో నుంచి తీసిన ద్రవాలను సరిగా గుర్తించలేకపోవడం, వైరస్‌ మ్యుటేషన్‌  కావడం, నమూనా సరిగా సేకరించకపోవడం, నమూనాల రవాణాలో జాప్యం, కొన్నిసార్లు ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ మిక్సింగ్‌లో ఎర్రర్స్‌ రావడం, ఒక్కోసారి మనం ఇంట్లో యాంటీ బయోటిక్స్‌ వాడుతూ నమూనాలు ఇచ్చినప్పుడు వైరస్‌ సరిగా డిటెక్ట్‌ కాకపోవడం, వీటన్నిటితో పాటు టెక్నీషియన్‌  నైపుణ్యత ఇవన్నీ కారణాలుగా చెప్పుకోవచ్చు. దీనివల్ల బాధితుడికి నష్టం జరగవచ్చు. అందుకే లక్షణాలు ఉండి నెగెటివ్‌ వచ్చినప్పుడు ఆర్టీపీసీఆర్‌ టెస్టు, లేదా సీటీ స్కాన్‌  చేయించుకుంటే మంచిది.  
- డా.జి.ప్రవీణ్‌ కుమార్, మైక్రోబయాలజిస్ట్‌ ఔషధ నియంత్రణ శాఖ ల్యాబొరేటరీ

చదవండి: 
ఏ వ్యాక్సిన్‌ మంచిది? గర్భిణులు టీకా తీసుకోవచ్చా?

ర్యాపిడ్‌, ఆర్టీపీసీఆర్‌ టెస్టుల్లో తేడా ఏంటి ?

డోసుల మధ్య ఎంత విరామం అవసరం? తేడా వస్తే ?

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top