నకిలీ సర్టిఫికెట్ల భరతం పడతాం: డీజీపీ 

DGP Mahender Reddy Warned Criminals Who Make Fake Certificates Punished - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నకిలీ డిగ్రీలను తయారు చేస్తున్న నేరస్తుల భరతం పడతామని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. దీనికోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి సమన్వయంతో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. ప్రత్యేక పోర్టల్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో సోమవారం ఆయన ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ యూనివర్సిటీలు ఇచ్చే సరిఫికెట్లన్నీ ఒకే పోర్టల్‌ ద్వారా సంబంధిత కంపెనీలు తేలికగా పరిశీలించుకునే అవకాశం ఉందన్నారు. ఎక్కడైనా నకిలీ అని తేలితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని వీసీలకు సూచించారు. ఈ ప్రక్రియలో పోలీసులు పూర్తి సహకారం అందిస్తారని చెప్పారు. సర్టిఫికెట్ల ధ్రువీకరణ దిశగా అన్ని యూనివర్సిటీలు డేటాను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆర్‌.లింబాద్రి మాట్లాడుతూ నకిలీల గుర్తింపునకు ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తామన్నారు. అవసరమైన సంస్థలు పోర్టల్‌కు లాగిన్‌ అవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 2016 వరకు అన్ని సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌ చేశామని, త్వరలో మిగతా సంవత్సరాలవి కూడా చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్‌ వెంకటరమణ, యూనివర్సిటీల వీసీలు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top