కుమార్తె లవ్‌ మ్యారేజ్‌: కానిస్టేబుల్‌ దంపతుల ఆత్మహత్య | Daughter Love Marriage: Constable Couple Committed Suicide | Sakshi
Sakshi News home page

కుమార్తె లవ్‌ మ్యారేజ్‌: కానిస్టేబుల్‌ దంపతుల ఆత్మహత్య

Apr 20 2021 10:55 PM | Updated on Apr 21 2021 3:47 AM

Daughter Love Marriage: Constable Couple Committed Suicide - Sakshi

కుమార్తె ప్రేమ పెళ్లి చేసుకోవడంతో తమ పరువు పోయిందని కానిస్టేబుల్‌ దంపతులు ఉరేసుకున్నారు.

సంగారెడ్డి: తమ కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందని మనస్తాపానికి గురయిన ఆ భార్యాభర్తలు మనస్తాపం చెందారు. ప్రేమ పెళ్లి చేసుకుని తమ పరువు తీసిందని కానిస్టేబుల్‌ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కంది మండలంలో చోటుచేసుకుంది. కంది మండల కేంద్రానికి చెందిన కానిస్టేబుల్ నారాయణ జిన్నారం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి భార్య రాజేశ్వరి, కుమార్తె ఉన్నారు. అయితే వారం కిందట వారి కుమార్తె ప్రేమ వివాహం చేసుకుంది. కూతురు ప్రేమ వివాహ చేసుకోవడంతో తమ పరువు పోయిందని నారాయణతో పాటు ఆయన భార్య రాజేశ్వరి కూడా భావిస్తున్నారు. అదే బాధతో మంగళవారం ఆ దంపతులు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement