టీకా రెండో డోస్‌ వేసుకున్నాక కోవిడ్‌తో మృతి

Covid Positive After Taking Second Dose Of Vaccine And Priest Dies - Sakshi

వివాహం జరిపించిన అనంతరం జ్వరం బారిన పడ్డ ఆలయ పూజారి 

సాక్షి, శంకరపట్నం (మానకొండూర్‌): కోవిడ్‌ టీకా రెండో డోస్‌ వేసుకున్న తర్వాత కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చి పూజారి మృతిచెందారు. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు మత్స్యగిరీంద్రస్వామి ఆలయ పూజారి శేషం రవీంద్రాచార్యులు(47) పదిరోజుల క్రితం కోవిడ్‌ టీకా సెకండ్‌ డోస్‌ తీసుకున్నారు. తర్వాత మత్స్యగిరీంద్రస్వామి ఆలయంలో ఓ వివాహం జరిపించారు.

అనంతరం జ్వరం రావడంతో కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. హోం ఐసోలేషన్‌లో ఉండగా, మూడ్రోజుల క్రితం పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని ప్రైవేట్‌ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. కరోనా నిబంధనల మేరకు సైదాపూర్‌ మండ లం వెన్నంపల్లిలో అంత్యక్రియలు నిర్వహించినట్లు గ్రామస్తులు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top