తెలంగాణలో 894 పాజిటివ్‌, 10 మంది మృతి | Coronavirus 894 Positive Cases Reported In Telangana State | Sakshi
Sakshi News home page

తెలంగాణలో 894 పాజిటివ్‌, 10 మంది మృతి

Aug 17 2020 9:13 AM | Updated on Aug 17 2020 9:47 AM

Coronavirus 894 Positive Cases Reported In Telangana State - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 8794 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 894 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 92,255 కు చేరింది. కొత్తగా 2006 మంది వైరస్‌ బారి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 70,132 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,420 యాక్టివ్‌ కేసులున్నాయి. తాజాగా 10 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 703 కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా రికవరీ రేటు 76.01 శాతంగా ఉంది. ఈమేరకు వైద్యారోగ్యశాఖ సోమవారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 7,53,349 వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేశామని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement