తెలంగాణలో కొత్తగా 3,018 కరోనా కేసులు | Coronavirus: 3018 New Positive Cases Registered In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ : కొత్తగా 3,018 కేసులు,10 మరణాలు

Aug 26 2020 9:43 AM | Updated on Aug 26 2020 9:48 AM

Coronavirus: 3018 New Positive Cases Registered In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనావైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి. తాజాగా బుధవారం ఒకే రోజు మూడు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 3,018 మంది కరోనా బారిన పడ్డారని తెలంగాణ ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,688 కి చేరింది. తాజాగా 10 మంది వైరస్‌ బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 780 కి చేరింది. గడచిన 24 గంటల్లో 1,060 మంది కోవిడ్‌ పేషంట్లు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 85,223 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 25,685 యాక్టివ్‌ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా  బాధితుల రికవరీ రేటు 75.92 శాతంగా ఉండగా.. తెలంగాణలో రికవరీ రేటు 76.30 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు 10,82,094 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వెల్లడించింది.



 

Advertisement
 
Advertisement
Advertisement