
హైదరాబాద్: స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు జారీ చేయనున్న ఆర్డినెన్స్ చరిత్రలో నిలిచిపోనుందని సిరిసిల్లా జిల్లా కాంగ్రెస్ నేత నేవూరి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎమ్మెల్యే కాలనీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఎంత మంచి పని చేసినా కూడా ప్రతిపక్ష పార్టీల నేతలు ధర్నాలు, నిరసనల పేరుతో చేస్తున్న డ్రామాలు ఇకనైనా ఆపాలని సిరిసిల్లా జిల్లా కాంగ్రెస్ నేత నేవూరి వెంకట్‌రెడ్డి అన్నారు.
గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ బీసీల జనాభా ఎంతో తేల్చలేదని సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ చొరవతో బీసీ కుల గణన పూర్తి చేశారని రాహుల్ గాంధీ ఆదేశాలతో చేసిన ఈ కుల గణన పూర్తి కావడంతో తెలంగాణ మోడల్ వైపు దేశం మొత్తం చూస్తోందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు చేయడంతో బీసీలు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటారని రాజకీయంగా వారికి మంచి అవకాశాలు లభించినట్లు అవుతుందని అన్నారు.
ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని పదేళ్ళు అధికారలలోకి ఉండి ఏం చేయలేదని బీఆర్‌ఎస్ పార్టీ నేతలు ఇప్పుడు ధర్నాలు, నిరసనల పేరుతో కొత్త డ్రామాకు తెరతీస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఎంతో మంచి పథకాలు అందుతున్నాయని, ఉచిత కరెంటు, రైతు భరోసా, మహాలక్ష్మి పథకం, సబ్సిడీ గ్యాస్, సన్న బియ్యం పథకాలను పేదలు ఎంతో ఆదరిస్తున్నారని అన్నారు.