బిస్కెట్‌ కావాలా.. | Collector Garima Agrawal Gives Biscuit To A Kid | Sakshi
Sakshi News home page

బిస్కెట్‌ కావాలా..

May 23 2026 11:31 AM | Updated on May 23 2026 11:50 AM

Collector Garima Agrawal Gives Biscuit To A Kid

రాజన్నసిరిసిల్ల:  చంద్రంపేటలో నిర్వహించిన జిల్లా సభలో ఓ ఆసక్తికర ఘటన అందరినీ ఆకట్టుకుంది. సభ జరుగుతుండగా ఓ చిన్నారి ఏమాత్రం భయపడకుండా నేరుగా వేదికపైకి ఎక్కి అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. దీంతో అక్కడున్న అధికారులు, ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

అయితే జిల్లా కలెక్టర్‌ గరీమా అగ్రవాల్ చిన్నారిని చూసి చిరునవ్వుతో దగ్గరకు పిలిచారు. ప్రేమగా మాట్లాడి బిస్కెట్లు ఇచ్చారు. “ఇంకా ఏమి కావాలి అని అడిగి అక్కడే ఉన్న కాజు, బాదం కూడా చిన్నారి చేతికి అందించారు.

కలెక్టర్‌ చూపిన ఆప్యాయతకు సభలో ఉన్నవారు ఫిదా అయ్యారు. చిన్నారి కూడా ఎంతో ఆనందంగా అక్కడే కూర్చొని తింటూ కనిపించింది. ఈ ఘటనతో సభలో కాసేపు ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement