‘నందు’డు అందరి వాడేలే! అన్ని పార్టీల్లోని ప్రముఖులతో టచ్‌లో..

Cash For MLA Scam Accused Nanda Kumar Links With TRS Leaders - Sakshi

‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో స్వామీజీలతో చిక్కిన నందు

సాక్షి, హైదరాబాద్‌: నంద కుమార్‌ కోరె.. ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఈ పేరు మారు మోగుతోంది. రామచంద్ర భారతి, సింహయాజి స్వామిలతో కలిసి చిక్కిన ఇతడు మీ పార్టీ మనిషంటే... మీ పార్టీ మనిషంటూ బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఆరోపణలు చేసుకుంటున్నాయి. బుధవారం రాత్రి నుంచి నందకుమార్‌కు చెందిన కొన్ని కార్యక్రమాలు, తన వ్యాపార సంస్థల ప్రారంభోత్సవాల ఫొటోలు, వీడియో లు వైరల్‌ అయ్యాయి. కర్ణాటక నుంచి వచ్చి నగరంలో స్థిరపడిన నందకుమార్‌కు అన్ని పార్టీల్లో మంచి స్నేహితులున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉన్నతాధికారులతో కలసి తిరిగిన చరిత్ర ఉంది. 

మంత్రులతోనూ సన్నిహితంగా...
నందకుమార్‌ ప్రస్తుతం బంజారాహిల్స్‌ రోడ్‌ నం.12లో నివసిస్తున్నాడు. ఫిల్మ్‌ నగర్‌లో డబ్ల్యూ3 పేరుతో రెస్టా రెంట్‌ ఏర్పాటు చేశాడు. దీంతో ఇతడికి సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులతో పరిచ యాలు ఏర్పడ్డాయి. దీనికి ముందు సీజన్స్‌ హోటల్, సదరన్‌ స్పైస్, ఆ తర్వాత దక్కన్‌ కిచెన్, ప్రస్తుతం ఏపీ, తెలంగాణ ల్లో గ్రూప్‌ రెస్టారెంట్లు, బార్లు, వైన్సుల్లో వాటాలు నందు ఖాతాలో ఉన్నాయి. వీట న్నింటిలోనూ రాజకీయ, సినీ ప్రముఖుల తోపాటు అధికారులకూ వాటాలు ఇచ్చా డని, వారిలో అనేక మందికి ఇతడు బినామీ అని తెలుస్తోంది. మంత్రులు, వివిధ బోర్డుల చైర్మన్లతోపాటు కేంద్ర మంత్రులతోనూ సన్నిహితంగా మెలిగాడు. 

పలు సంస్థల్లో డైరెక్టర్‌గా..
సైదాబాద్‌కు చెందిన అవల అభిషేక్‌ 2008 నుంచి బేగంబజార్‌ కేంద్రంగా గుట్కా, జర్దా, పాన్‌ మసాల వ్యాపారం చేస్తూ మాణిక్‌చంద్‌ సంస్థకు ప్రధాన ఏజెంట్‌గా వ్యవహరించాడు. 2015 నుంచి 7 హిల్స్‌ మార్కెట్స్‌ ప్రాంతంలో సొంతంగా సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు. బీబీన గర్‌ సమీపంలోని నేమర గోముల గ్రామంలో యూనిట్‌ స్థాపించి ‘7 హిల్స్‌ మాణిక్‌ చంద్‌’ పేరుతో పాన్‌ మసాల, జర్దాలను ఉత్పత్తి చేసి విక్రయించేవాడు.

ఆపై గుజరాత్‌ నుంచి గుట్కా తెచ్చి అక్రమంగా విక్రయించాడు. ఈ గుట్కా దందాలో నందకుమార్‌ కీలకంగా ఉన్నాడని తెలిసింది. అభిషేక్‌ ను 2019లో హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. అభిషేక్, నందు సంయుక్తంగా వే ఇండియా టుబాకో ప్రైవేట్‌ లిమిటెడ్, 7 హిల్స్‌ మాణిక్‌చంద్‌ ప్రొడక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, 7 హిల్స్‌ మార్కెటర్స్‌ అండ్‌ మ్యాను ఫ్యాక్చరర్స్‌ ప్రైవేట్‌ లిమిటె డ్, డబ్ల్యూ3 హాస్పిటాలిటీస్‌ సర్వీసెస్‌ సంస్థలకు డైరెక్టర్లుగా ఉన్నారు.

డబ్ల్యూ3 సంస్థలో తేజేశ్వర్‌రావు కల్వకుంట్ల కూడా ఓ డైరెక్టర్‌గా ఉన్నారు. అభిషేక్‌ ‘7 హిల్స్‌ మాణిక్‌చంద్‌ పాన్‌ మసాల’ ఉత్పత్తులకు ఫ్రాంచైజీలు, డిస్ట్రిబ్యూషన్స్, సీ అండ్‌ ఎఫ్‌ ఏజెన్సీలు ఇస్తానంటూ తెలంగాణ, ఏపీ, బిహార్, ఒడిశా, బెంగాల్లో అనేక మందిని మోసం చేశా డు. ఈ వ్యవహారా ల్లోనూ నందు పాత్ర ఉన్నట్లు ఆరో పణలున్నాయి. నందు తండ్రి కోరె శంకరప్ప బేగంబజార్‌లో వ్యాపారం చేస్తుంటారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top