
సనత్‌నగర్(హైదరాబాద్): ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన యువతి (19) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. కొన్నేళ్ల క్రితం ఆమెకు బేగంపేట ప్రకాష్ నగర్‌కు చెందిన ఆర్యతో ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారిరువురు తరచూ వ్యక్తిగతంగా కలుసుకుని మాట్లాడుకునేవారు.
ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి సదరు యువతిని తన ఇంటికి తీసుకెళ్లిన ఆర్య ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో గర్భం దాల్చిన బాధితురాలు తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అంతేగాగా ఆమె వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తీసిన అతను తనను విడిచిపెట్టి వెళ్లాలని, లేని పక్షంలో ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడు. దీంతో బాధితురాలు సోమవారం బేగంపేట పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిపై