
నెలన్నర ముందే నోటిఫికేషన్ ఇవ్వనున్న ఎక్సైజ్ శాఖ
ఈసారి రూ.3,500 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా
కొత్త షాపుల ఏర్పాటు తర్వాతే బదిలీలు, పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండేళ్ల కాలానికి వైన్‌షాపుల నిర్వహణ కోసం దసరా పండుగ తర్వాత దరఖాస్తులు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ యోచిస్తోంది. ఈ ఏడాది నవంబర్ 30తో ప్రస్తుత షాపులకు గడువు ముగియనున్న నేపథ్యంలో అక్టోబర్ 5వ తేదీ తర్వాత కొత్త పాలసీ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో ఆ శాఖ అధికారులున్నారు. దరఖాస్తులు చేసుకునేందుకు తగినంత సమయం ఇవ్వడం ద్వారా ఎక్కువ దరఖాస్తులు వచ్చేలా చూడాలన్న ఆలోచనతోనే దసరా ముగిసిన వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్న ట్టు సమాచారం.
అయితే రాష్ట్రంలో 2,620 వైన్‌షాపులుండగా ఆ సంఖ్యను పెంచుతారా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. రాష్ట్రంలో ఎంత జనాభాకు ఒక వైన్‌షాపు ఉండా లో 2011 జనాభా లెక్కల ఆధారంగా నిర్ధారించా రు. ఆ తర్వాత జనగణన జరగక పోవడంతో ఇప్పటికీ ఆ సంఖ్యనే కొనసాగిస్తున్నారు. కానీ ఈసారి షాపుల సంఖ్యను పెంచే అవకాశాలున్నాయని ఎక్సైజ్ వర్గాలంటున్నాయి.
గత పాలసీతో రూ.2,920 కోట్ల ఆదాయం
గత రెండేళ్ల పాలసీ ప్రకారం వైన్‌షాపుల నిర్వహ ణకు ఆహ్వానించిన దరఖాస్తుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2,920 కోట్ల మేరకు ఆదాయం వచ్చింది. ఈసారి ఆదాయం రూ.3,500 కోట్లు దాటుతుందనే అంచనాలో ఎక్సైజ్ శాఖ ఉంది. దరఖాస్తు ఫీజును రూ.3 లక్షలకు పెంచి, తగిన స మయం కూడా ఇస్తే ఈ ఆదాయం మరింత పెరు గుతుందని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి దరఖాస్తుల స్వీకరణకు నెలన్నర రోజులు గడువు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది.
మరోవైపు ఆదాయార్జిత శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచి్చనప్పటికీ ఇప్పుడప్పుడే స్థానచలనం అవసరం లేదనే భావనలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులున్నట్టు తెలుస్తోంది. ఈసారి వైన్‌షాపుల ఏర్పాటు కోసం దరఖాస్తుల ప్రక్రియ ముగిసి, కొత్త షాపులు ప్రారంభమైన తర్వాత బదిలీలతో పాటు పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను కూడా చేపట్టే యోచనలో ఉన్నట్టు సమాచారం.