కొత్త బైక్ కొనేవారికి రెండు హెల్మెట్లు!

Buy New Bike, Get 2 Helmets Free - Sakshi

మీరు ఈ మధ్య కాలంలో కొత్త బైక్ కొన్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. మనలో ఎంత మందికి తెలుసు, మనం బైక్ కొన్న కంపెనీలు హెల్మెట్ ఇస్తాయని. చాలా మందికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు. కానీ, సెంట్రల్ మోటార్ వేహికల్స్ రూల్స్ ,1989 యాక్ట్ రూల్ నెంబర్ 138(4)(ఎఫ్) ప్రకారం.. ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసే సమయంలో వాహన తయారీ కంపెనీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సూచించిన స్పెసిఫికేషన్లకు అనుగుణంగా ఉన్న రెండు హెల్మెట్లను కస్టమర్లకు అందించాల్సి ఉంటుంది.(చదవండి: మార్కెట్లోకి మరో కొత్త టీవీఎస్ బైక్)

కొత్త బైక్‌ ఎక్కడ కొంటున్నారో ఆ షోరూం వారిని కచ్చితంగా రెండు హెల్మెట్లు అడగాలని అని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు సూచిస్తున్నారు. హెల్మెట్లు ఇవ్వకపోతే వెంటనే వినియోగదారుల ఫోరమ్‌, పోలీసు, ఆర్టీవో అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. గతంలో బీఎస్ఐ ప్రమాణాల ప్రకారం సూచించిన ఐఎస్ఐ హెల్మెట్లను కంపెనీలు వినియోగదారులకు అందజేయాలని, అలా చేయకపోతే మహారాష్ట్ర మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలను నిషేధించాలని స్థానిక కోర్టు రవాణా కమిషనర్ ను ఆదేశించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top