రఘునందన్‌ Vs టీఆర్‌ఎస్‌!

BJP MLA Raghunandan Rao Inauguration Of Development Work - Sakshi

గుడికందు గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే రఘునందన్‌రావు

పెరుగుతున్న పెట్రో ధరలపై టీఆర్‌ఎస్‌ శ్రేణుల నిరసన 

ఎమ్మెల్యేను మిరుదొడ్డి పోలీస్‌ స్టేషన్‌కు తరలించడంతో అక్కడ ఇరుపార్టీల ఆందోళనలు 

మిరుదొడ్డిలో తీవ్ర ఉద్రిక్తత 

మిరుదొడ్డి (దుబ్బాక)/ బెజ్జంకి (సిద్దిపేట)/సాక్షి, హైదరాబాద్‌: అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావును.. పెరుగుతున్న పెట్రో ధరలపై టీఆర్‌ఎస్‌ శ్రేణులు నిలదీయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు ఎమ్మెల్యేను మిరుదొడ్డి పోలీస్‌ స్టేషన్‌కు తరలించడం, అక్కడ టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు పోటా పోటీగా ఆందోళనలకు దిగడంతో ఉద్రి క్తత ఏర్పడింది.

ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా తొగుట మండ లం గుడికందులో పలు అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు గురువారం ఆ గ్రామానికి వెళ్లారు. అయితే గ్రామంలోని టీఆర్‌ఎస్‌ నాయకులు.. కేంద్ర ప్రభు త్వం పెంచిన పెట్రోల్, డీజీల్, గ్యాస్‌ ధరల ను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మెల్యే వద్ద నిరసన వ్యక్తం చేశారు.

రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు ఎమ్మెల్యేను మిరుదొడ్డి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రఘు నందన్‌రావు పోలీస్‌ స్టేషన్‌లో నేలపై భైఠాయించారు. ఏసీపీ దేవారెడ్డి, సీఐ కృష్ణ ఆయన్ను శాంతింపజేసేందుకు విఫలయత్నం చేశారు. విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు స్టేషన్‌కు తరలివచ్చి ఎమ్మెల్యేకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు పోలీస్‌ స్టేషన్‌ వద్ద ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేయడంతో పరి స్థితి ఉద్రిక్తంగా మారింది.

అప్రమత్తమైన పోలీసులు ముందుగా బీజేపీ కార్యకర్తలను, ఆ తర్వాత ఎమ్మెల్యే రఘునందన్‌రావును బలవంతంగా అరెస్టు చేసి బెజ్జంకి పోలీస్‌ స్టేషన్‌కు తరలించడం తో గొడవ సద్దుమణిగింది. బెజ్జంకి పోలీస్‌ స్టేషన్‌ వద్ద విలేకరులతో మాట్లాడిన రఘునందన్‌రావు.. అధికారం ఎప్పుడూ ఒక్కరికే ఉండదనే విషయం పోలీసులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.  

ఎమ్మెల్యేను విడుదల చేయండి: బండి సంజయ్‌ 
ఎమ్మెల్యే రఘునందన్‌ రావును వెంటనే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఢిల్లీ నుంచి ఫోన్‌లో ఆయన సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌తో మాట్లాడారు. కొం దరు పోలీసులు టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top