
ఖమ్మం మీదుగా భారీ కంటైనర్లు ప్రయాణించినప్పుడల్లా గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఖమ్మంలోని కరుణగిరి వద్ద మున్నేరు బ్రిడ్జి, రాపర్తినగర్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జీలు చిన్నగా ఉండడంతో ఈ ఇబ్బంది ఎదురవుతోంది.
మంగళవారం భారీ మెషినరీని తీసుకెళ్తున్న 74 టైర్లతో కూడిన కంటైనర్ లారీ ఈ రహదారిలో ప్రయాణించింది. దీంతో మున్నేరు, ఆర్‌ఓబీల వద్దకు కంటైనర్ వస్తుండగానే.. అధికారులు ఇతర వాహనాలు బ్రిడ్జీలపైకి రాకుండా నిలిపివేశారు. భారీ వాహనం వెళ్లే వరకు వాహనాలను నిలిపివేయడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.
- స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఖమ్మం.