సతాయిస్తోందంటూ.. అత్తను చంపిన కోడలు | atha kodalla insdent in Mahabubnagar District | Sakshi
Sakshi News home page

సతాయిస్తోందంటూ.. అత్తను చంపిన కోడలు

Oct 6 2025 8:25 AM | Updated on Oct 6 2025 8:26 AM

atha kodalla insdent in Mahabubnagar District

ఇంట్లో ఎవరూ లేని వేళ రాడ్డుతో దాడి.. అత్త మృతి

వనపర్తి జిల్లా నాగపూర్‌లో దారుణం.. నిందితురాలి అరెస్ట్‌ 

మహబూబ్ నగర్ జిల్లా: ఇంట్లో నిత్యం గొణుగుతూ తనను సతాయిస్తోందంటూ వృద్ధురా లైన అత్తను ఓ కోడలు రాడ్డుతో కొట్టి చంపింది. ఈ అమానుష ఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని నాగపూర్‌ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. రేవల్లి ఎస్సై రజిత కథనం ప్రకారం నాగపూర్‌ గ్రామానికి చెందిన ఎల్లమ్మ (73), దసరయ్య దంపతులకు నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఎల్లమ్మ భర్త దసరయ్య కొన్నాళ్ల క్రితం మృతిచెందడంతో కుమారుడు మల్ల య్య వద్ద ఎల్లమ్మ ఉంటోంది. 

అయితే కోడలు బొగురమ్మతో తరచూ ఆమె గొడవ పెట్టుకొనేది. దీంతో ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమ యంలో ఎల్లమ్మను బొగురమ్మ రాడ్డుతో కొట్టగా ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేయడంతో వారు ఘటనాస్థలికి చేరుకొని నిందితురాలిని అరెస్ట్‌ చేశారు. తనను ఇబ్బందులకు గురిచేస్తుండటంతో తానే చంపానని బొగురమ్మ పోలీసుల ఎదుట నేరం అంగీకరించింది. ఈ ఘటనపై ఎల్లమ్మ రెండో కూతురు బచ్చమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement