ఆర్థికాభివృద్ధిలో ఆర్యవైశ్యులు | Arya Vysyas plays a key role in reconstruction and economic development: Telangana | Sakshi
Sakshi News home page

ఆర్థికాభివృద్ధిలో ఆర్యవైశ్యులు

Mar 23 2026 4:25 AM | Updated on Mar 23 2026 4:26 AM

Arya Vysyas plays a key role in reconstruction and economic development: Telangana

మాట్లాడుతున్న సీఎం రేవంత్‌. చిత్రంలో పొంగులేటి, టీజీ భరత్‌

ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచారు: సీఎం రేవంత్‌ రెడ్డి

ఆర్యవైశ్యులకు మున్సిపల్‌ చైర్మన్‌ పదవులతో ప్రాధాన్యతనిచ్చాం

ఎల్‌బీ స్టేడియంలో ఘనంగా శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవం

సాక్షి, హైదరాబాద్‌: ఆర్యవైశ్యులు ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వారు కీలక పాత్ర పోషించారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు. తెలంగాణ ఆర్థిక అభివృద్ధిలోనూ ఆర్యవైశ్యుల భాగస్వామ్యం కీల కమైందన్నారు. ఇటీవల ఆర్యవైశ్యులకు 6 మున్సిపల్‌ చైర్మన్‌ పదవులతోపాటు ఒక మేయర్‌ పదవి ఇచ్చి రాజకీయంగా ప్రాధాన్యత కల్పించామని పేర్కొన్నారు. ఆర్యవైశ్య వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్టు సౌజన్యంతో తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఎల్‌బీ స్టేడి యం వేదికగా శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవాన్ని ఆది వారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ‘అవకాశాలు వచ్చినా రాకు న్నా.. ఆర్యవైశ్యులు క్రమశిక్షణతో ఉంటారు.

నాకు ఇష్టమైన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి రోశయ్య.. ఆయనతో వాదించడం, ప్రశ్నించడం గౌరవంగా ఉండేది. ఆర్యవైశ్యులు వారి హక్కులను కూడా శాంతియుత పద్ధతి లోనే తెలిపే ప్రయత్నం చేస్తారు. ఊరిలో ఒక్క ఆర్యవై శ్యు డున్నా.. ఊరంతా ఆయన చేతిలోనే ఉంటుంది. వ్యవసాయ కూలీలకు, రైతులకు, నమ్మకంతో అప్పులు ఇచ్చి తిరిగి తీసుకుంటారు’ అని చెప్పారు.

ఈ సందర్భంగా వాసవీ మాత జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ కల్వ సుజాత సీఎంను కోరగా.. శాసన సభ సమావేశాలు ముగిసేలోపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటా మని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీని వాస్‌ రెడ్డి, ఏపీ మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే సూర్య నారా యణ, ఎమ్మెల్సీ దయానంద్‌ గుప్తా, మాజీ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా, వివిధ రాష్ట్రాలకు చెందిన 16 మంది పీఠాధిపతులు, ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

సామూహిక పారాయణం.. గిన్నిస్‌ రికార్డు
ఎల్‌బీ స్టేడియం వేదికగా నిర్వహించిన శ్రీ వాసవి మహాశక్తి మహోత్సవంలో భాగంగా గిన్నిస్‌ బుక్‌ రికార్డు కోసం అద్భుత కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ కవి చింత శ్రీనివాస్‌ రచించి, స్వరకర్త శ్రీ జోశ్యభట్ల స్వరపరిచిన 102 చరణాల వాసవీ పారాయణాన్ని గాయని కల్పన పాడగా.. 21 వేల మంది (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కలిపి 30 వేల మంది) వైశ్యులు సామూహికంగా పారాయణం చేశారు. ఇది ప్రపంచ రికార్డు సాధించింది. ఈ సందర్భంగా గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు సర్టిఫికెట్‌ ప్రదానం చేశారు. కాగా, 28 అడుగుల భారీ అమ్మవారి విగ్రహం వద్ద 16 మంది పీఠాధిపతులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement