పెళ్లికి ముందే వరకట్న వేధింపులు.. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే..

Before marriage dowry harassment at Banjara Hills - Sakshi

బంజారాహిల్స్‌: నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజు నుంచే వరకట్న వేధింపులకు పాల్పడుతున్న యువకుడిపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలోని రోహిత్‌ డేవిడ్‌ పాల్‌కు గత ఏడాది మార్చి 1న కంట్రీక్లబ్‌లో యువతితో నిశి్చతార్థం జరిగింది. ఇందుకోసం అత్తింటివారు రూ.10 లక్షల వరకు ఖర్చు చేశారు.

గతేడాది జూలైలో పెళ్లి చేయాలని నిశ్చయించారు. సదరు యువకుడు పెళ్లి గురించి ఎన్నిసార్లు అడిగినా దాటవేస్తూ వచ్చాడు. ఆయన తల్లి కూడా ఈ పెళ్లి విషయంలో పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. రూ.2 కోట్ల వరకట్నం ఇస్తే చేసుకుంటానంటూ ఇటీవల మెలిక పెట్టాడు. చర్యలు తీసుకోవాల్సిందిగా బాధితురాలి మేనమామ ఇచి్చన ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదైంది.నిశ్చితార్థం సమయంలో బంగారు ఉంగరం, దుస్తుల కోసం రూ.10 లక్షల వరకు ఖర్చు చేసినట్లు వాటిని తిరిగి ఇప్పించాల్సిందిగా కోరారు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top