తమిళనాడులో ఉత్కంఠ రేపుతున్న మధురాంతకం, ధారపురం ఉప ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం ఎలక్ట్రా నిక్‌ ఓటింగ్‌ యంత్రాలు , వీవీప్యాట్లు ఆయా పోలింగ్‌ కేంద్రాలకు సోమవార | - | Sakshi
Sakshi News home page

తమిళనాడులో ఉత్కంఠ రేపుతున్న మధురాంతకం, ధారపురం ఉప ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం ఎలక్ట్రా నిక్‌ ఓటింగ్‌ యంత్రాలు , వీవీప్యాట్లు ఆయా పోలింగ్‌ కేంద్రాలకు సోమవార

Oct 9 2026 6:54 AM | Updated on Oct 9 2026 6:54 AM

నిఘా వలయంలో మధురాంతకం, ధారాపురం

ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

పోలింగ్‌ కేంద్రాలకు చేరిన సామాగ్రి

సాక్షి, చైన్నె : 2026 అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకే నుంచి గెలిచిన మరగదం కుమారవేల్‌ (మధురాంతకం), సత్యభామ (ధారపురం) తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయడంతో ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ రెండు స్థానాల్లోనూ ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొని పంచముఖ సమరంగా మారింది.

మధురాంతకం నియోజకవర్గం (ఎస్సీ)

ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,13,788 మంది ఉన్నారు. వీరిలో 1,04,926 పురుషులు, 1,08,797 మహిళలు, 65 మంది ట్రాన్స్‌జెండర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక్కడ మొత్తం 285 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 60 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. 2,514 మంది భద్రతా సిబ్బందితో పాటు కేంద్ర బలగాలకు చెందిన 7 కంపెనీల పారా మిలటరీ నియోజకవర్గాన్ని మోహరించింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 27 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో అధికార టీవీకే అభ్యర్థిగా ఈ సారి మరగతం కుమర వేల్‌, డీఎంకే తరపున పరంథామన్‌, అన్నాడీఎంకే తరపున కనిత సంపత్‌, సీపీఎం తరపున సుగంధి, నామ్‌ తమిళర్‌ కట్చి తరపున జానకీరామన్‌లు పోటీలో ఉన్నారు. ఇక్కడ ఒక్కో పోలింగ్‌ బూత్‌లో రెండు బ్యాలెట్‌ యూనిట్లను ఉపయోగిస్తున్నారు.

సెలవులు – భద్రతా ఏర్పాట్లు

పోలింగ్‌ జరుగుతున్న మధురాంతకం, ధారపురం నియోజకవర్గాల పరిధిలోని పాఠశాలలకు సోమ వారంతో పాటూ మంగళవారం కూడా సెలవు ప్రకటించారు. అలాగే ఒక్క రోజు ఆయా నియోజకవర్గాల్లో ప్రభుత్వ సెలవు దినంగా అమలు చేయనున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగేందుకు వీలుగా అన్ని పోలింగ్‌ బూత్‌లలో వెబ్‌క్యాస్టింగ్‌, వీడియో రికార్డింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఇక ప్రస్తుతం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో, ఓటర్లు క్యూలైన్లలో నిలబడేందుకు వీలుగా పోలింగ్‌ కేంద్రాల ముందు ప్రత్యేకంగా టెంట్లను ఏర్పాటు చేశారు. వీల్‌చైర్‌ అవసరమైన దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. అలాగే వృద్ధులు, ఓటర్ల కోసం అవసరమైన విద్యుత్‌, నీటి వసతి ఏర్పాట్లను పూర్తి చేశారు. పోలింగ్‌కు అవసరమైన సామాగ్రి సోమవారం సాయంత్రం న్ని పోలింగ్‌ కేంద్రాలకు చేర్చారు.ఎన్నికల పర్యవేక్షకులు ఆయా కేంద్రాలలో పరిశీలించారు. ఉదయాన్నే పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం, సాయంత్రం ముగిసిన తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూములకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. నియోజకవర్గానికి సంబంధంలేని వ్యక్తులు లాడ్జీలు, మ్యారేజ్‌ హాల్స్‌, కమ్యూనిటీ హాళ్లు, హాస్టళ్లలో బస చేసి ఉన్నారా..? అని తనిఖీలు నిర్వహించి, వారిని బయటకు పంపించేశారు. నియోజకవర్గం పరిధిలో వాహన తనికీలుముమ్మరంగా జరుగుతున్నాయి.

ధారపురం నియోజకవర్గం (ఎస్సీ)

ధారపురంలో టీవీకే తరపున ఈ సారి సత్యభామ, డీఎంకే అభ్యర్థిగా సుకన్య, అన్నాడీఎంకే అభ్యర్థిగా భానుమతి,నామ్‌ తమిళర్‌ కట్చి అభ్యర్థిగా కార్తిక, సీపీఐ అభ్యర్థిగా లక్ష్మణన్‌ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,23,306 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,07,285, సీ్త్రలు 1,16,013,ఇతరులు 8 మంది ఉన్నారు. 320 పోలిం గ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా, వీటిలో 20 సమస్యాత్మకంగా ఉన్నాయి. ఇక్కడ 22 మంది అభ్యర్థు లు బరిలో ఉండటంతో, ప్రతి పోలింగ్‌ బూత్‌లోనూ రెండు బ్యాలెట్‌ యూనిట్లను ఉపయోగిస్తున్నారు.

నేడే పోలింగ్‌

తట్టంచవాడిలోనూ..

పుదుచ్చేరిలోని ప్రతిష్టాత్మకమైన తట్టంచవాడి అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు 1,300 మందికి పైగా పారామిలిటరీ, పోలీసు సిబ్బందిని భద్రతా విధుల్లో మోహరించారు. ఇటీవల ముగిసిన పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల్లో మంగళం, తట్టంచవాడి అనే రెండు స్థానాల నుంచి పోటీ చేసి గెలిచిన సీఎం ఎన్‌. రంగస్వామి.. తట్టంచవాడి నియోజకవర్గ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 26,921 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 12,575 పురుషులు, 14,341 మహిళలు, 5 మంది ఇతరులు ఉన్నారు. అలాగే, 350 మంది దివ్యాంగులు, ముగ్గురు ప్రవాస ఓటర్లు ఉన్నారు. కొత్తగాా 584 మంది ఓటర్లకు గుర్తింపు కార్డులు జారీ చేశారు. మొత్తం 31 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ స్థానంలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తం 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ తరఫున అశోక్‌ ఆనంద్‌, కాంగ్రెస్‌ నుంచి వినాయగం, డీఎంకే నుంచి సేతుసెల్వం, సీపీఐ నుంచి ఎ.ఎం. సలీం బరిలో నిలిచారు.ఈ ఉప ఎన్నికలలో క్లూనీ స్కూల్‌లో పూర్తిగా మహిళలే నిర్వహించే ప్రత్యేక పింక్‌ బూత్‌ను ఏర్పాటు చేశారు. పక్కుముదయన్‌పట్టు ప్రభుత్వ పాఠశాలలో రెండు మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలను, వినోబానగర్‌ అంబేడ్కర్‌ మిడిల్‌ స్కూల్‌లో యువత నిర్వహించే పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement