సాక్షి, చైన్నె: చైన్నెలోని పట్టినంబాక్కంలో కొత్త సచివాలయం నిర్మించాలనే తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. ఏ ప్రదేశంలో భవనం నిర్మించాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం న్యాయస్థానాలకు లేదని తేల్చిచెప్పింది. వివరాలు.. చైన్నెలోని పట్టినంబాక్కంలో రూ. 1,200 కోట్ల వ్యయంతో తమిళనాడు హౌసింగ్ బోర్డుకు చెందిన 21.37 ఎకరాల స్థలంలో కొత్త సచివాలయాన్ని నిర్మించనున్నట్లు అసెంబ్లీలో సీఎం విజయ్ ప్రకటించారు. దీనికి వ్యతిరేకంగా నిరసనలు బయలుదేరా యి. ప్రతి పక్షాలన్నీ వ్యతిరేకిస్తూ వస్తున్న తరుణంలో చైన్నెకి చెందిన న్యాయవాది ఆర్.ఎస్. తమిళవేందన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. రాస్ట్ర ప్రభు త్వం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న తరుణంలో కొత్త భవనం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం ప్రజాధనం వృథా చేయడమేనని వివరించారు. సెయింట్ జార్జ్ కోటలోని భవనాన్నే పునరుద్ధరించి ఉపయోగించుకోవచ్చని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా, ఆ స్థలంలో పేదల కోసం ఇళ్ల నిర్మాణం చేపట్టాలని, పట్టినంబాక్కంలో సచివాలయ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరారు.
కోర్టు ఆగ్రహం.. హెచ్చరిక
ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ. ధర్మాధికారి, జస్టిస్ జి. అరుళ్మురుగన్ ధర్మాసనం విచారించింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలలో కోర్టులు జోక్యం చేసుకోలేవని న్యాయమూర్తులు స్పష్టం చేశా రు. ఎక్కడ భవనం నిర్మించాలో, ఎక్కడ నిర్మించకూడ దో ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం కోర్టుకు లేదని స్పష్టం చేశారు. కొత్త పార్లమెంటు భవన నిర్మాణంపై దాఖలైన కేసులను, గతంలో 2011లో వచ్చిన ఇలాంటి కేసులను సుప్రీంకోర్టు, హైకోర్టు కొట్టివేశాయని గుర్తు చేశారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలలో కోర్టు లు ఎలా జోక్యం చేసుకుంటాయి? ఈ కేసు కేవలం ప్రచారం కోసమే దాఖలు చేసినట్లు భావిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేవౠరు. భారీ జరిమానాతో పిటిషన్‌ను కొట్టివేస్తామని హెచ్చరించడంతో పిటిషనర్ అలర్ట్ అయ్యారు. తాను ఈ కేసును ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. దీంతో న్యాయస్థానం ఎలాంటి జరిమానా విధించకుండా పిటిషన్‌ను కొట్టివేసింది.


