నేను పెంచిన బిడ్డ చైన్నె మెట్రో.. | - | Sakshi
Sakshi News home page

నేను పెంచిన బిడ్డ చైన్నె మెట్రో..

Oct 9 2026 1:26 AM | Updated on Oct 9 2026 1:26 AM

● ఘనతనన్న స్టాలిన్‌

సాక్షి, చైన్నె : పూందమల్లి – పోరూర్‌ – వడపళని మధ్య చైన్నె మెట్రో రైలు తొలి సేవలు ఈనెల 11న ప్రారంభం కానున్న నేపథ్యంలో డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎం.కే. స్టాలిన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. చైన్నె మెట్రో రైలు ప్రాజెక్ట్‌ రూపకల్పనలో, చరిత్రలో డీఎంకే ప్రభుత్వానిది చెరగని ముద్ర అని ఆయన గర్వంగా పేర్కొన్నారు. తాను డిప్యూటీ సీఎంగా ఉన్న కాలంలోనే చైన్నె మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌కు బీజం పడిందని, స్వయంగా జపాన్‌ వెళ్లి జైకా సంస్థ నుంచి నిధులు సాధించి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించామని ఆయన గుర్తుచేశారు. మెట్రో మొదటి విడత ద్వారా విమానాశ్రయం, చైన్నె సెంట్రల్‌, కోయంబేడు వంటి ప్రధాన రవాణా కేంద్రాలను అనుసంధానించామని, నగరంలో ట్రాఫిక్‌ సమస్యలకు ఇది గొప్ప పరిష్కారమైందని తెలిపారు. 2015 వరదల సమయంలో లక్షలాది మందికి మెట్రో రక్షగా నిలిచిందని పేర్కొన్నారు.

రెండవ విడత డీఎంకే కృషి..

2021లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెట్రో రెండో దశ పనులను వేగవంతం చేశామని, కేంద్ర ప్రభుత్వం నుంచి వాటా నిధులు ఆలస్యమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులురూ. 11,762 కోట్లు, విదేశీ రుణాలు రూ. 6,802 కోట్లతో కలిపి మొత్తం రూ. 18,564 కోట్లతో పనులను నిరంతరాయంగా కొనసాగించామని వివరించారు. ప్రాజెక్ట్‌ భారాన్ని తగ్గించేందుకు 50:50 ఈక్విటీ ప్రా తిపదికన చేపట్టాలని ప్రధానికి స్వయంగా లేఖలు రాసి, చర్చలు జరిపినట్లు ఆయన గుర్తుచేశారు. సొరంగ మార్గాలు, అడయార్‌ నది కింద మెట్రో నిర్మాణం, 108 అడుగుల ఎత్తైన వంతెన నిర్మాణాలను తాను స్వయంగా పరిశీలించినట్లు చెప్పారు. కోయంబత్తూరు, మదురై నగరాలకు మెట్రో సాధన కోసం తాము చేసిన పోరాటాలను, చైన్నె వన్‌ అనే సింగిల్‌ యాప్‌ విధానం ద్వారా అన్ని ప్రజా రవా ణా టిక్కెట్లను అనుసంధానించిన ఘనత ద్రావిడ మోడల్‌ ప్రభుత్వానిదేనని స్టాలిన్‌ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement