17న చైన్నెలో అతిపెద్ద నైట్‌ రన్నింగ్‌ ఈవెంట్‌ | - | Sakshi
Sakshi News home page

17న చైన్నెలో అతిపెద్ద నైట్‌ రన్నింగ్‌ ఈవెంట్‌

Oct 9 2026 1:26 AM | Updated on Oct 9 2026 1:26 AM

● జెర్సీ ఆవిష్కరించిన ఆసియాక్రీడల పతక విజేతలు

కొరుక్కుపేట: మహిళల పట్ల గౌరవం, సమ్మిళితత్వం , భద్రతతో కూడిన సంస్కృతిని పెంపొందించటమే లక్ష్యంగా ఈనెల 17న చైన్నెలో అతిపెద్ద నైట్‌ రన్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు . తమిళనాడు అథ్లెటిక్‌ అసోసియేషన్‌ (టీఎన్‌ఏఏ) ,స్పోర్ట్స్‌ ప్రో మేనేజింగ్‌ పార్టనర్‌ అయిన శబరి , సిమ్స్‌ హాస్పిటల్‌, మైండ్‌ స్పేస్‌ బిజినెస్‌ పార్కు ఆర్‌టీఐటీ, ఎస్‌డీఏటీ ఆధ్వర్యంలో జరుగనున్న ఈ నైట్‌రన్‌ ఈవెంట్‌ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈకార్యక్రమానికి అతిథులుగా ఆసియా క్రీడల పతక విజేతలు భరణీకా ఇలంగోవన్‌ , విద్యా రాంరాజ్‌ , అభినయ రాజరాజన్‌ పాల్గొని నైట్‌ రన్‌ జెర్సీతోపాటు నగదు బహుమతులను ఆవిష్కరించారు . ఈ సందర్భంగా మైండ్‌ స్పేస్‌ ఆర్‌ఈఐటి మేనేజింగ్‌ డైరెక్టర్‌ రమేష్‌ నాయర్‌ మాట్లాడుతూ మహిళల భద్రత లక్ష్యంగా ఈనెల 17న జరుగనున్న ఈ నైట్‌ రన్‌లో 4 వేలమందికి పైగా పాల్గొంటున్నట్టు తెలిపారు. ఆ రోజు సాయంత్రం 7 గంటలకు చైన్నెలోని ఐల్యాండ్‌ గ్రౌండ్స్‌ వేదికగా 10కె ,4కె ఫ్యామిలీ రన్‌ ప్రారంభం అవుతుందని తెలిపారు . అనంతరం తమిళనాడు అథ్లెటిక్‌ అసోసియేషన్‌ ప్రణాళిక , అమలు కమిటీ ఛైర్మెన్‌ సి లత మాట్లాడుతూ అథ్లెటిక్స్‌ , సామూహిక భాగస్వామ్య క్రీలను ప్రోత్సహించటంలో ఈ కార్యక్రమం ప్రత్యేకంగా నిలుస్తోందని అన్నారు , చైన్నె నైట్‌ రన్‌ వంటి ఈవెంట్లు ఫిట్‌నెస్‌ సంస్కృతిని పెంపొందించటంలో సహయపడుతుందని , అంతేకాకుండా ఫన్‌గాను ఉంటుందని వివరించారు . అత్యంత వేగంగా పరుగెత్తిన పురుషులు , మహిళలకు ఒక్కో క్కరికి రూ. లక్ష చొప్పన బహుమతి , మొదటి రన్నరప్‌, రెండో రన్నరప్‌ లకు రూ.75 వేలు, రూ.50 వేలు చొప్పున అందిస్తున్నట్టు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఛీప్‌ విప్‌, ఎమ్మెల్యే ఆర్‌ శబరినాథన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement