సౌర విద్యుత్‌ రంగాన్ని మరింతగా ప్రోత్సహించండి | - | Sakshi
Sakshi News home page

సౌర విద్యుత్‌ రంగాన్ని మరింతగా ప్రోత్సహించండి

Oct 9 2026 1:26 AM | Updated on Oct 9 2026 1:26 AM

● మంత్రి నిర్మల్‌కుమార్‌కు వినతి

సాక్షి, చైన్నె : తమిళనాడులో సౌర విద్యూత్‌ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తగి న చర్యలు తీసుకోవాలని తమిళనాడు సోలార్‌ ఎనర్జీ డెవలపర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పి. శివకుమార్‌ కోరారు. ఈ మేరకు చైన్నెలో జరిగిన కార్యక్రమంలో పలు కీలక డిమాండ్లను ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. 10 కిలోవాట్లకు పైగా ఉండే సోలార్‌ సిస్టమ్‌లకు సంబంధించిన సేఫ్టీ సర్టిఫికేషన్‌ ప్రక్రియను సులభతరం చేయాలని, కనీసం 500 కిలోవాట్ల వరకు గల వ్యవస్థలకు సులభతరమైన అనుమతులు మంజూరు చేయాలని, కేవలం గృహ వినియోగదారులకే కాకుండా, వాణిజ్య సంస్థలకు కూడా నెట్‌ మీటరింగ్‌ సౌకర్యాన్ని వర్తింపజేయాల ని కోరారు. కొత్త సౌర విద్యూత్‌ విధానం కింద వర్చువల్‌ మీటరింగ్‌, గ్రూప్‌ మీటరింగ్‌ విధా నాల ను ప్రవేశపెట్టాలని కోరారు. ఈసందర్భంగా మంత్రి నిర్మల్‌కుమార్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో రూఫ్‌టాప్‌ సోలార్‌ పథకాన్ని ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తు న్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇళ్లకు సోలార్‌ విద్యూత్‌ వ్యవస్థలను అందించడమే లక్ష్యంగా పెట్టు కున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీని కూడా దీనికి అందిస్తున్నామన్నారు. ఇప్పటివరకు ఈ పథకం కింద దాదాపు 20,000 దరఖాస్తులు అందగా, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,500 రిజిస్ట్రేషన్‌ కంపెనీల ద్వారా పను లు జరుగుతున్నాయని వివరించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఇళ్లలో సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటును పూర్తి చేయడమే తమ లక్ష్యమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement