నా వెలుగును ఎవరూ ఆర్పలేరు! | - | Sakshi
Sakshi News home page

నా వెలుగును ఎవరూ ఆర్పలేరు!

Oct 5 2026 12:33 AM | Updated on Oct 5 2026 12:33 AM

●టీవీకే నాయత్వంపై నాంజిల్‌ అసంతృప్తి ●వైరల్‌గా మారిన పోస్ట్‌

సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రచార కార్యదర్శి, ప్రముఖ వక్త నాంజిల్‌ సంపత్‌ సోషల్‌ మీడియాలో పెట్టిన ఒక ప్రకటన తమిళనాడు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ‘‘నా వెలుగును ఎవరూ ఆర్పలేరు.. నా గాలిని ఎవరూ అడ్డుకోలేరు’’ అంటూ ఆయన ఆవేదనతో పెట్టిన పోస్ట్‌, టీవీకే పార్టీ నాయకత్వంతో ఆయన విబేధిస్తున్నారనే అనుమానాలకు బలం చేకూర్చినట్లయ్యింది. వివరాలు.. విద్యార్థి దశలో డీఎంకేతో ప్రారంభమై, ఆ తర్వాత వైగో నేతృత్వంలో ఎండీఎంకేలో నాంజిల్‌ సంపత్‌ కీలక పాత్రను పోషించారు. ఆ తదుపరి పరిణామాలతో అన్నాడీఎంకేలో చేరి ప్రచార కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వ హించారు. జయలలిత మరణానంతరం టీటీవీ దినకరన్‌ వైపు నిలిచి, ఆ తర్వాత మళ్లీ డీఎంకే వేదికలపై ప్రసంగించారు. గత ఏడాది డిసెంబర్‌లో విజయ్‌ సమక్షంలో టీవీకే పార్టీలో చేరి ప్రచార కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. పార్టీలో చేరిన అనతికాలంలోనే ఆయన పెట్టిన ఈ ఆవేదనతో కూడిన పో స్ట్‌, విజయ్‌ నేతృత్వంలోని టీవీకే పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయనడానికి నిదర్శ నమని విశ్లే షకులుభావిస్తున్నారు.

ఉప ఎన్నికల ప్రచారానికి దూరం

ధారాపురం, మధురాంతకం అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు సంబంధించిన పార్టీ ప్రచార బాధ్యతల జాబితా నుంచి నాంజిల్‌ సంపత్‌ను పక్కన పెట్టడమే ఈ అసంతృప్తికి కారణమని సమాచారం. టీవీ చర్చల్లో పాల్గొంటున్న ఆయన, ఇటీవల టీవీకే పాలనా శైలిలో కొన్ని లోపాలు ఉన్నాయని బహిరంగంగా వ్యాఖ్యానించడం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. అయితే, ఆ లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పినప్పటికీ, పార్టీ నాయక త్వం ఆయన వైఖరి పై అసంతృప్తితో ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఆయన పె ట్టిన పోస్టు రాజకీయ వర్గాలలో హాట్‌టాపిక్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement