తిరుత్తణి: సర్వ దర్శనం మార్గంలోని గాలి గోపురంలోని శిలా విగ్రహం కూలిపడి స్వామి దర్శనానికి క్యూలైన్‌లో వేచివున్న నలుగురు భక్తులకు గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం భక్తులకు ఆందోళనకు గురిచేసింది. వివరాలు.. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆదివారం సెలవురోజు సందర్భంగా తమిళనాడుడు, ఆంధ్ర సహా వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కొండ ఆలయంకు చేరుకుని స్వామి దర్శనం భారీగా తరలివచ్చారు. సర్వ దర్శన క్యూలైన్‌లో పెద్ద సంఖ్యలో భక్తులు వేచివుండగా ఆలయ లోపలి ప్రకారానికి వెళ్లే మార్గంలోని పురాతన గాలి గోపురం నుంచి యాలి శిలా విగ్రహం అకస్మాత్తుగా కూలి కిందపడింది. దీంతో అక్కడే స్వామివారి దర్శనం కోసం వేచివున్న ముగ్గురు మహిళా భక్తులు సహా నలుగురి తలకు బలమైన గాయాలై య్యాయి, దీంతో క్యూలైన్‌లో వేచివున్న భక్తులు ఆందోళన చెందారు. వెంటనే 108 ఆంబులన్స్‌కు సమాచారంతో చేరుకున్న ఆంబులన్స్ సాయంతో తిరుత్తణి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో క్షతగాత్రులను చేర్పించారు. వారికి వైద్యులు మెరుగైన వైద్య సేవలు చేస్తున్నారు. గోపుర శిలా విగ్రహం కూలడం పట్ల సమాచారంతో ఆసుపత్రికి చేరుకున్న తిరుత్తణి పోలీసుల విచారణలో ధర్మపురికి చెందిన లక్ష్మి60). జయ (65), ఆంధ్రాలోని తిరుపతికి చెందిన మణికండన్(30), సావిత్రి(45) అని తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గోపుర విగ్రహాలకు మరమ్మతులు చేపట్టాలి
తిరుత్తణి కొండ ఆలయంలో గాలి గోపురాలు నిర్మాణం పూర్తి చేసుకుని 500 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి. పైగా కొండపైన వానరాల బెడద ఎక్కువగా వుంది. వానరాలు విగ్రహాల శిలలను ధ్వంసం చేయడంతో పాటూ బలహీన పరుస్తున్నా యి. దీంతో శిలా విగ్రహాలు అప్పుడప్పుడు కూలడంతో పాటు రాళ్లు భక్తులపై పడుతున్నందున గా యాలవుతున్నాయి. ఈనేపథ్యంలో ఆలయ నిర్వాహకులు గోపుర విగ్రహాల శిలలకు మరమత్తులు చేపట్టి భద్రత కల్పించాలని భక్తులు కోరారు.
గాలి గోపురం నుంచి కూలిపడిన యాలి విగ్రహం
దెబ్బతిన్న సర్వదర్శనం మార్గంలోని గాలి గోపురం


