మళ్లీ చైన్నె 28నే నమ్ముకున్న వెంకట్‌ప్రభు | - | Sakshi
Sakshi News home page

మళ్లీ చైన్నె 28నే నమ్ముకున్న వెంకట్‌ప్రభు

Oct 5 2026 12:33 AM | Updated on Oct 5 2026 12:33 AM

తమిళసినిమా: చైన్నె 28 అనే చిన్న చిత్రంతో కెరీర్‌ను ప్రారంభించిన దర్శకుడు వెంకట్‌ప్రభు. 2007లో విడుదలైన ఆ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. ఆ తరువాత కూడా సరోజా, గోవా అంటూ చిన్న బడ్జెట్‌ చిత్రాలనే చేశారు. అలాంటిది సడన్‌గా మంగాత్తా అంటూ అజిత్‌, అర్జన్‌ వంటి స్టార్‌ హీరోలతో చిత్రం చేసి హిట్‌ కొట్టారు. దీంతో స్టార్‌ దర్శకుడి స్థాయికి చేరుకున్నారు. అదే విధంగా నటుడు శింబు హీరోగా మానాడు చిత్రాన్ని తెరకెక్కించి మరో హిట్‌ కొట్టారు. కాగా చివరిగా నటుడు విజయ్‌ హీరోగా గోట్‌ చిత్రాన్ని చేశారు. 2024లో విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఆ తరువాత వెంకట్‌ ప్రభు మరో చిత్రం చేయలేదు. నటుడు శివకార్తికేయన్‌ హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే అది చివరి దశలో ఈ చిత్రం రద్దు అయ్యింది. కాగా తాజాగా దర్శకుడు వెంకట్‌ప్రభు తనను దర్శకుడిగా పరిచయం చేసిన చైన్నె 28 చిత్రాన్న నమ్ముకున్నారు. ఈయన ఇంతకు ముందే చైన్నె 28 చిత్రానికి సీక్వెల్‌ చేశారు. ఆ చిత్రం 2016లో తెరపైకి వచ్చింది. దీంతో ఇప్పుడు దానికి మూడో భాగానికి సిద్ధం అయ్యా రు. ఇది కూడా స్ట్రీట్‌ క్రికెట్‌ క్రీడ నేపధ్యంలో సాగే కథా చిత్రమే. ఈ చిత్రం కోసం చైన్నెలో బ్రహ్మాండ సెట్‌ను వస్తున్నట్లు సమాచారం. చిత్ర షూటింగ్‌ను వచ్చే నెలలో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. చిత్ర షూటింగ్‌ మొదటి షెడ్యూల్‌ను 10 రోజుల పాటు నిర్వహించి తదుపరి బ్యాంకాక్‌లో చిత్రీకించనున్నట్లు సమాచారం. చైన్నె 28 చిత్ర రెండు భాగాల మాదిరిగానే మూడో భాగం ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రధాన అంఽశంగా ఉంటుందని తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement