తమిళసినిమా: నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ బోల్డ్ అండ్ బ్యూటీ ప్రముఖ నటుడు శరత్‌కుమార్ వారసురాలు అన్న విషయం తెలిసిందే. బెల్లి డాన్స్‌లో శిక్షణ పొందిన ఈ బ్యూటీ ఆ తరువాత కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. అలా పోడా పోడి చిత్రంతో కథానాయకిగా కెరీర్‌ను ప్రారంభించిన వరలక్ష్మీశరత్‌కుమార్ అలా కొన్ని చిత్రాల్లో నటించినా ఆ తరువాత ప్రతి నాయకి పాత్రలకు సై అన్నారు. అలా బహుభాషా నటిగా గుర్తింపు పొందిన ఈమె సరస్పతి అనే చిత్రం ద్వారా దర్శక నిర్మాతగానూ అవతరించారు. కాగా వరలక్ష్మీశరత్‌కుమార్ గత 2024లో ముంబాయికి చెందిన ఇక్లోలాయ్ సచ్‌దేవ్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు. కాగా ఏ విషయానైనా నిర్మొహమాటంగా, నిర్బయంగా చెప్పే సంచలన నటిగా ముద్ర వేసుకున్నారు. అలాంటి నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఇటీవల ఒక భేటీలో తన వివాహ జీవితం, పిల్లలు గురించి పేర్కొంటూ శ్రీ పెళ్లి అయిన తరువాత తరచూ సంతానం గురించి పలువురు అడుగుతున్నారు. నా భర్త అనుమతితో నేను పిల్లలను కనకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఇది పిల్లలు పుట్టక తీసుకున్న నిర్ణయమా ? అని అడుగుతున్నారు. అలాంటి దేమీ లేదు. చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. పిల్లలను కనడం కంటే వారిని సక్రమంగా పెంచి పెద్ద చేయడం నిజమైన బాధ్యత అని నేను నమ్మతాను. తల్లిదండ్రులు అనే గుర్తింపు పొందే ముందు పిల్లలను సక్రమంగా పెంచడానికి బాధ్యత ఉండాలి. నేను నా భర్తకు మొదటి వివాహం ద్వారా కలిగిన బిడ్డను తన బిడ్డగానే భావిస్తున్నాను. అంతే కాకుండా మా ఇంటిలో రెండు కుక్కపిల్లను పెంచుకుంటున్నాను. వాటిని పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను శ్రీ అని నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఈమె పోలీస్ కంప్‌లైంట్ అనే తెలుగు చిత్రంలోనూ, రైజనా అనే ఆంగ్లం,తమిళం భాషల్లో రూపొందుతున్న చిత్రంలోనూ నటిస్తున్నారు.
నటి వరలక్ష్మీ
శరత్‌కుమార్


