– తమిళనాడు అంగన్‌వాడీ పెన్షనర్ల డిమాండ్
సాక్షి, చైన్నె: తమిళనాడు పోషకాహార, అంగన్‌వాడీ పెన్షనర్లకు నెలకు రూ. 6,750 ప్రత్యేక పింఛనుతో పాటూ జాతీయ ఆరోగ్య బీమాను వర్తింపజేయాలని తమిళనాడు పోషకాహార, అంగన్‌వాడీ ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. విరుదునగర్‌లో నిర్వహించిన ఈ సంఘం మూడవ రాష్ట్ర సదస్సు రెండవ రోజు కార్యక్రమంలో ఆదివారం తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి వెయ్యికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సులో మానవ హక్కుల పరిరక్షణ కేంద్రం రాష్ట్ర సమన్వయకర్త, న్యాయవాది వాంజినాథన్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
సదస్సులో కీలక తీర్మానాలు
● రెవెన్యూ గ్రామ సహాయకులకు ఇస్తున్న తరహాలోనే అంగన్‌వాడీ పెన్షనర్లకు కూడా రూ. 6,750 ప్రత్యేక పింఛను, సమానమైన కరువు భత్యం అందించాలి.
● పెన్షనర్లందరికీ రూ. 300 వైద్య భత్యంతో పాటు ఉచిత జాతీయ ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పించాలి.
● 10, 20, , 30 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు తగిన ప్రోత్సాహక వేతనాలు మంజూరు చేయాలి.
సదస్సుకు హాజరైన అంగన్‌వాడీ పెన్షనర్లు


