తిరువొత్తియూర్ : చైన్నె చూలై, నల్లముత్తు వీదిలోని 77వ సర్కిల్ హిందూ ఫ్రంట్ ఆఫ్ ఎగ్మోర్ బ్లాక్ సెంట్రల్ చైన్నె జిల్లా ఆధ్వర్యంలో 6వ వార్షిక ఓం శ్రీ శివశక్తి వినాయక చతుర్థి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. హిందూ ఫ్రంట్ 77వ సర్కిల్ కార్యదర్శి పసుమూర్తి శ్రీనివాసన్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో వినాయకునికి విశేష పూజలను భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఈ వినాయక చతుర్థి ఉత్సవాలకు గాను వరుసగా ఆరవ సంవత్సరం కూడా స్వామివారి విగ్రహాన్ని పరుసు వెంకటరమణయ్య , పరుసు పోలయ్యలు కానుకగా అందిస్తుండటం విశేషం. ఈ సందర్భంగా పసుమూర్తి శ్రీనివాసన్ మాట్లాడుతూ వినాయకుని ఆశీస్సులు ఉంటే అన్నింటా విజయాలు లభిస్తాయని అన్నారు. ఉత్సవాల సందర్భంగా స్వామివారికి విశేష పూజలతో పాటు సాంస్కృతిక భక్తి కార్యక్రమాలను చేపట్టినట్టు తెలిపారు. వినాయక ఉత్సవాల్లో పిడి జయరామన్ , నాగయ్య , రామారావు, గోవింద రాజులు ,కృష్ణ తోపాటు ఇంకా నారాయణమూర్తి , పురుషోత్తమబాబు , పసుమూర్తి కుటుంబసభ్యులు , ఆదర్శగ్రామ వికాస్ సేవా సంఘం , తట్టాంగుళం ఆది ఆంధ్ర భక్తులు పాల్గొన్నారు.


