అన్నానగర్: నీలగిరి జిల్లా కూడాలూర్ సమీపం ఒవేలి మున్సిపాలిటీ పరిధిలో లారస్తాన్ నంబరు– 4 ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో నివసిస్తున్న బాలకృష్ణన్ (65) రైతు. అయిన ఇతను తన వ్యవసాయ భూమికి, ఇంటి పనులకు అవసరమయ్యే నీటిని సమీపంలోని ప్రైవేట్ కాపీ తోట ప్రాంతంలోని ఫౌంటెన్ ప్రాంతం నుండి ఒక ప్లాస్టిక్ ట్యూబ్ ద్వారా తీసుకుని వచ్చి ఉపయోగిస్తు వచ్చాడు. శనివారం సాయంత్రం ఆ కొళాయిలో నీరు రాకపోవడం తో పైపు బాగుచేయడానికి అతను చెరువు వద్దకు వెళ్లాడు. చాలా సేపటి వరకు అతను ఇంటికి తిరిగి రాకపోవడంతో, అతని కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగుపొరుగు వారు అతడిని వెతకడానికి వెళ్లారు. అప్పటికే చీకటి పడటంతో వారు అతడిని గుర్తించలే ఆదివారం ఉదయం తిరిగి వచ్చి మళ్లీ వెతకగా, కాఫీ తోటలో బాలకృష్ణన్ మృతదేహం లభ్యమైంది. అతని శరీరంలోని కొన్ని భాగాలపై పులి దాడి చేసిన గుర్తులు కనిపించాయి. అటవీ శాఖ, పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.
ఏనుగు దాడిలో మరో రైతు..
అన్నానగర్: ఈరోడ్ జిల్లాలోని తలవాడి కొండల ప్రాంతంలోని కామయన్‌పురం గ్రామానికి చెందిన బసవ చెట్టి (62) రైతు. ఇతను తన తోటలో పసుపు, బంగాళదుంపలు, మొక్కజొన్న పండిస్తారు. ఏనుగుల బారి నుండి పంటలను కాపాడటానికి ఆయన రాత్రిపూట కాపాలాకు పడుకున్నాడు. ఈక్రమంలో, శనివారం రాత్రి బసవ చెట్టి ఎప్పటిలాగే తోటలో కాపలా కాస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 3 గంటలకు, ఒక అడవి ఏనుగు తోటలోకి ప్రవేశించి మొక్కజొన్న పంటను నాశనం చేస్తుండడంతో దాన్ని తరిమేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో, ఆ అటవీ ఏనుగు ఆయనను వెంబడించి దాడి చేయడంతో, బసవ చెట్టి అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన పై అటవీ శాఖ, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అన్నాడీఎంకే మాజీ మంత్రులకు టీవీవేలో కీలక పదవులు
సాక్షి,చైన్నె : అన్నాడీఎంకేను వీడి తమిళగ వెట్రి కలగం పార్టీలో చేరిన మాజీ మంత్రులు, సీనియర్ నాయకులకు టీవీకే అధిష్టానం పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించింది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కొత్త జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీలు (జిల్లా నిర్మాణ కార్యదర్శులు), డిప్యూటీ జనరల్ సెక్రటరీల (ఉప ప్రధాన కార్యదర్శులు) నియామకం చేపట్టినట్లు టివికె నాయకత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
కొత్త పదవుల వివరాలు
జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీలు :
సి. విజయభాస్కర్– పుదుక్కోటై జిల్లా
ఎం.ఆర్. విజయభాస్కర్– కరూర్ జిల్లా
ఇసక్కి సుబ్బయ్య– తెన్కాశి జిల్లా
డిప్యూటీ జనరల్ సెక్రటరీలుగా మరకతం కుమరవేల్, రాజగోపాల్, హెచ్. జాకీర్ హుస్సేన్, వి. కుమార్, ఎస్. యువరాజ్, సి.వి. దినకరన్, కే. మణికండన్, ఆర్.ఎస్. మణికండన్, కే. అరుల్‌రాజ్, ఎస్.టి.ఆర్. శాముయేల్ రాజ్‌ను నియమించారు. కాగా పార్టీ విభాగాన్ని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకే ఈ నూతన బాధ్యతలను కేటాయించినట్లు పార్టీ పేర్కొంది.
తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌కు
50 వసంతాలు
– ఘనంగా స్వర్ణోత్సవ వేడుకలు
సాక్షి,చైన్నె: దక్షిణ భారత రవాణా వ్యవస్థలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రతిష్టాత్మక ‘తమిళనాడు ఎక్స్‌ప్రెస్’ రైలు తన 50 ఏళ్ల విజయవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది (స్వర్ణోత్సవాలు). ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చైన్నె సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు, రైల్వే అధికారులు , రైలు అభిమానులు సంయుక్తంగా కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచి వేడుకలు జరుపుకున్నారు.
రైలు సమగ్ర వివరాలు .. చారిత్రక అంశాలు
ఆగస్టు 7, 1976లో ఈ రైలు సేవ మొదలైంది. ప్రారంభంలో వారానికి 3 రోజులు మాత్రమే ఈ రైలు అందుబాటులో ఉండేది. ప్రయాణికుల రద్దీ, ఆదరణ దృష్ట్యా జూన్ 1988 నుండి దీనిని రోజు వారీ సర్వీస్‌గా మార్చారు. చైన్నె సెంట్రల్ నుండి ప్రతిరోజూ రాత్రి 10:00 గంటలకు బయలుదేరే ఈ రైలు, మొత్తం 2,182 కిలోమీటర్ల దూరాన్ని 32 గంటల 30 నిమిషాలలో చేరుకుంటుంది.
సంబరాలు
ఢిల్లీ నుంచి చైన్నెకి వచ్చిన ఈ రైలు లోని ప్రయాణికులు రైలు లోకో పైలట్లను (డ్రైవర్లను) ఆదివారం ఘనంగా సత్కరించారు. పూలతో అలంకరించిన రైలు ఇంజన్ ముందు ప్రయాణికులు ఫొటోలు దిగారు. ఢిల్లీకి పయనమైన తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌కు అభిమానులు, రైల్వే సిబ్బంది హృదయ పూర్వక వీడ్కోలు పలికారు.


