– ప్రారంభించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్
సాక్షి, చైన్నె: చైన్నెలోని ఎస్‌ఆర్‌ఎమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ స్టడీస్, సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ హ్యూమానిటేరియన్ లా అండ్ రెఫ్యూజీ లా విభాగాలను జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ వి. రామసుబ్రమణియన్ అధికారికంగా ప్రారంభించారు. ఎస్‌ఆర్‌ఎమ్ స్కూల్ ఆఫ్ లా 2026 విద్యాసంవత్సరానికి కొత్తగా చేరిన 350 మందికి పైగా విద్యార్థుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జస్టిస్ వి. రామసుబ్రమణియన్ ఈసందర్భంగా మాట్లాడుతూ, న్యాయవాద వృత్తిలో రాణించాలంటే నిజాయితీ, పట్టుదల, జీవితాంతం నేర్చుకునే తత్వం ఎంతో ముఖ్యంగా పేర్కొన్నారు. చట్టపరమైన జ్ఞానాన్ని బోధించవచ్చు అని, అయితే, నైతిక ప్రవర్తన, కరుణ, విశ్లేషణాత్మక ఆలోచన, మానసిక పరిపక్వత మాత్రమే ఉత్తమ లాయర్లుగా తీర్చిదిద్దుతాయన్నారు. మానవ సంఘర్షణలను పరిష్కరించడంలో, చట్టాన్ని సరైన రీతిలో విశ్లేషించి న్యాయాన్ని కాపాడటంలో లాయర్ల అవసరం ఎంతో ఉందో ఆయన వివరించారు. అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ – ఇండియా ఎ.ఆర్.ఎల్. సుందరేశన్ , ఖైతాన్ – కో పార్టనర్ వివేఖ్ శ్రీరామ్, ఆవిద్యా సంస్థ ప్రొ–వైస్ ఛాన్సలర్ (లా) ప్రొఫెసర్ వై.ఎస్.ఆర్. మూర్తి పాల్గొన్నారు.


