తమిళసినిమా: క్రేజ్ ఉన్న తారలకు అవకాశాలు కొత్తేమీ కాదు. అలా ఒక క్రేజీ జంట కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. నటుడు శివకార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ప్రేక్షకుల ఆదరణ మెండుగా ఉన్న కథానాయకుడు ఈయన. అమరన్ చిత్రంతో ఈయన స్టార్ ఇమేజ్ బాగా పెరిగిపోయింది. శివకార్తికేయన్ ఇటీవల నటించిన పరాశక్తి చిత్రం కూడా బాగుందనిపించుకుంది. ప్రస్తుతం ఈయన నటుడు కమలహాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న సెయోన్ చిత్రంలో నటిస్తున్నారు. శివకుమార్ మురుగేశన్ కథ దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రంలో నటి భాగ్యలక్ష్మి భోర్సే నాయికిగా నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటున్నట్లు ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో తెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో నటుడు శివకార్తికేయన్ మరో కొత్త చిత్రానికి సిద్ధం అవుతున్నారు. దీనికి పార్కింగ్ చిత్రం ఫేమ్ రామ్ కుమార్ బాలకష్ణన్ దర్శకత్వం వహించనున్నారు. ఈయన నటుడు శింబు హీరోగా చిత్రం చిత్రం చేయనున్నట్లు సమాచారం జరిగింది. అయితే ఆ చిత్రం డ్రాప్ అయిందని,అదే కథను ఇప్పుడు శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కించనున్న తెలిసింది. కాగా ఇందులో క్రేజీ నటి కారాదు లోహర్ నాయకిగా నటించనున్నట్లు సమాచారం.ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రానికి సాయి అభయంకర్ సంగీతాన్ని అందిస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.
కయాదు లోహర్


